Mani Ratnam Movie: మణిరత్నం మూవీకి కౌంట్‌డౌన్.. జూలై 23 నుంచే విజయ్ సేతుపతి, సాయి పల్లవి షూటింగ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mani Ratnam Movie: మణిరత్నం దర్శకత్వంలో విజయ్ సేతుపతి, సాయి పల్లవి జంటగా తెరకెక్కనున్న కొత్త మూవీ వరుస అప్డేట్లతో అభిమానుల్లో క్యూరియాసిటీ పెంచుతోంది. టైటిల్ ఇంకా ప్రకటించకపోయినా, ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే ఇంట్రెస్టింగ్ బజ్ ఏర్పడుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ షెడ్యూల్, డిజిటల్ హక్కులు వంటి వివరాలు బయటకు రావడంతో ఈ మూవీ మరోసారి వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా మణిరత్నం, ఏఆర్ రెహమాన్, విజయ్ సేతుపతి, సాయి పల్లవి వంటి క్రేజీ కాంబినేషన్ ఒకే ప్రాజెక్ట్‌లో కలిసి రావడం అభిమానుల్లో అంచనాలను మరింత పెంచుతోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ మూవీ షూటింగ్ (జూలై 23) ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. తొలి షెడ్యూల్‌ను కోల్‌కతాలో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అక్కడ దాదాపు పది రోజుల పాటు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారని సమాచారం. అనంతరం చిత్రబృందం పుదుచ్చేరికి వెళ్లి రెండో షెడ్యూల్‌ను పూర్తి చేయనుంది. మొత్తం షూటింగ్‌ను సుమారు 40 రోజుల్లో పూర్తి చేయాలనే ప్రణాళికతో మణిరత్నం ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది.
ఇంతకుముందే ఈ సినిమాను ‘మద్రాస్ టాకీస్ ప్రొడక్షన్ నెం.23’ పేరుతో ప్రకటించారు. మణిరత్నం సినిమాలకు ప్రాణం పోసే సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మరోసారి ఈ ప్రాజెక్ట్‌కు సంగీతం అందిస్తున్నారు. ఆయన స్వరాలు ఈ ప్రేమకథను మరింత ప్రత్యేకంగా నిలబెడతాయని అభిమానులు ఆశిస్తున్నారు. ఇదిలా ఉండగా, సినిమా డిజిటల్ హక్కులు సుమారు రూ.20 కోట్లకు విక్రయించినట్లు సమాచారం. విదేశీ పంపిణీ హక్కులు, ఆడియో హక్కులు కూడా భారీ మొత్తానికే అమ్ముడైనట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో రిలీజ్ కు ముందే మార్కెట్లో ఈ మూవీకి ఎంతటి క్రేజ్ ఏర్పడిందో ఇట్టే తెలుస్తోంది. మరోవైపు విజయ్ సేతుపతి వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. త్వరలో ఆయన ‘స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్’ సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ మూవీలో సంయుక్త, టబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే ‘పాకెట్ నవల’ పేరుతో తెరకెక్కుతున్న మరో మూవీలో కూడా విజయ్ సేతుపతి నటిస్తున్నారు. త్యాగరాజన్ కుమారరాజా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం, ‘సూపర్ డీలక్స్’ తర్వాత వీరిద్దరి కలయికలో సెకండ్ మూవీగా నిలుస్తోంది. ఇందులో మాలవిక మోహనన్, రాజ్ బి. శెట్టి కూడా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
Also Read
- SJ Suryah Bodhi: 'జైలర్ 2' నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
- Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
- Deepika Padukone: నిన్ననే గుడిలో పూజలు.. మరోసారి ఆడబిడ్డకు జన్మనిచ్చిన దీపికా-రణ్వీర్!
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
అంతేకాకుండా వెట్రిమారన్ రూపొందిస్తున్న ‘అరసన్’ చిత్రంలో కూడా విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషిస్తున్నారు. శింబు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి ఓ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. ధనుష్ నటించిన ‘వడ చెన్నై’ సినీ విశ్వానికి స్పిన్ ఆఫ్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. సాయి పల్లవి విషయానికి వస్తే, ఆమె కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ‘రామాయణం’. నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రంలో రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తుండగా, సాయి పల్లవి సీత పాత్రలో కనిపించనున్నారు. యష్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇలాంటి భారీ ప్రాజెక్ట్‌ల మధ్య మణిరత్నం దర్శకత్వంలో విజయ్ సేతుపతితో ఆమె నటించనున్న ఈ రొమాంటిక్ డ్రామా కూడా ప్రేక్షకుల్లో భారీ హైప్ ను క్రియేట్ చేస్తోంది. ఇప్పుడు టైటిల్, ఫస్ట్ లుక్, షూటింగ్ అప్డేట్ల కోసం అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
- Tags
- cinema
- Mani Ratnam Movie
తాజావార్తలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
-
Karnataka: హృదయ విదారక ఘటన.. తల్లి శవంపై ఏడుస్తూ కనిపించిన రెండేళ్ల చిన్నారి
-
OTR: కాంగ్రెస్ కంచుకోటలో గ్రూప్ వార్.. క్యాడర్లో పెరుగుతున్న అసంతృప్తి..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!