Site icon NTV Telugu

Mani Ratnam : మణిరత్నం కోసం రాజీ పడిన ప్రశాంత్ నీల్.. ?

Prashan Neel

Prashan Neel

తన సినిమాలో నటించేటప్పుడు ఉన్నవి కాకుండా కొత్తగా మరో ప్రాజెక్ట్ కు కమిట్‌మెంట్లు ఇవ్వకూడదు. ఇది రాజమౌళి ఫార్ములా. దర్శకుడు నీల్ కూడా అదే పాటిస్తున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం మణిరత్నం కోసం ఈ నిబంధనలు నీల్ పక్కన పెట్టారని టాక్. ‘దగ్ లైఫ్’ మూవీతో బిజీగా ఉన్న మణిరత్నం.. దీం తర్వాత ఒక రొమాంటిక్ ఎంటర్ టైనర్ ప్లాన్ చేసుకున్నారు. దానికి హీరోగా నవీన్ పోలిశెట్టిని ఎంచుకున్నట్టు కొద్ది రోజులుగా వార్తలు కాస్త గట్టిగా వినిపిస్తున్నాయి. అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు కానీ ప్రాజెక్టు లాక్ అయిపోయిందని టాక్. అయితే హీరోయిన్‌గా రుక్మిణి వసంత్‌ని తీసుకున్నారట. అదే నిజమైతే ప్రశాంత్ నీల్ రాజీ పడినట్టే అనుకోవాలి.. ఎందుకంటే

Also Read : Rakul preet singh : దానికి వయసుతో సంబంధం లేదు..

జూనియర్ ఎన్టీఆర్‌తో ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న డ్రాగన్ (వర్కింగ్ టైటిల్) లో హీరోయిన్‌గా రుక్మిణి వసంత్‌ని ఎంచుకున్న విషయం తెలిసిందే. ఇక ఆమె ఏడాది పాటు ఏ ఇతర సినిమాలో నటించకూడదని నీల్ కండీషన్ పెట్టినట్టు గత ఏడాది వార్తలు వచ్చాయి. దానికి తగ్గట్టే రుక్మిణి ఆల్రెడీ షూటింగ్‌లో ఉన్నవి కాకుండా కొత్తగా కమిట్‌మెంట్లు ఏమి లేవు. అయితే మణిరత్నం అంటే ఇండస్ట్రీలో ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే. మరి  ఆయన సినిమా కోసం హీరోయిన్ విషయంలో ప్రశాంత్ నీల్ రాజీ పడక తప్పదు. ప్రస్తుతం సితార బ్యానర్ లో ‘అనగనగా ఒక రాజు’ చేస్తున్న నవీన్ దీని తర్వాత ఏదనే క్లారిటీ ఇప్పటిదాకా లేదు. చూస్తుంటే ఫైనల్‌గా మణిరత్నం లాంటి కల్ట్ డైరెక్టర్‌లో పడటం ఖాయంగానే కనిపిస్తోంది.

Exit mobile version