దక్షిణాదిలో లెజెండరీ డైరెక్టర్‌గా పిలుపందుకున్న వాళ్లలో ముందుండే పేరు మణిరత్నం. సౌత్ సినిమా దశ దిశను మార్చేలా ఆయన తీసిన గీతాంజలి, నాయకుడు, అంజలి, రోజా, బొంబాయి, సఖి, వంటి చిత్రాలు ఇప్పటికీ క్లాసిక్స్ లవ్ స్టోరీస్. అందుకే యూత్‌లో మణి సినిమాలకు అంత క్రేజ్. కానీ ఆ మధ్య కొంత కాలంలో ఆయన ఫామ్ తగ్గిపోయింది ఎక్కువ ఫ్లాపులు చవి చూశారు. తిరిగి దుల్కర్ సల్మాన్ తో ‘ఓకే బంగారం’ మూవీతో ఫామ్ లోకి వచ్చినట్టే వచ్చి.. కడలి, చెలియా, నవాబ్, లాంటి సినిమాలతో మళ్ళీ వెనక్కి పడిపోయాడు మణి. దీంతో ఈ సారి బారి ప్లాన్ తో ‘పొన్నియిన్ సెల్వన్’ మూవీ తీసి తిరిగి ట్రాక్ లోకి వచ్చాడు.
ప్రజంట్ కమల్ హాసన్, శింబుతో ‘తగ్ లైఫ్’ మూవీ పూర్తి చేసిన మణిరత్నం, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేస్తున్నారు. సమర్లో విడుదలకు ప్లాన్ చేయడంతో దానికి అనుగుణంగా అని పనులు ఫినిష్ చేస్తున్నాడు. ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చిన ఈ మూవీలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ మూవీ పూర్తి అయిన తర్వాత మణిరత్నం తన నెక్స్ట్ మూవీ ఎవరితో చేస్తారనే డౌట్ అందరిలో మొదలైంది. ‘దళపతి’ కాంబినేషన్ రిపీట్ చేస్తున్నారు అని, రజనీకాంత్ కు ఒక కథ కూడా చెప్పారని టాక్ గట్టిగా వినపడుతుంది.
కాని దానికి సమయం పటేలా ఉండటంతో, న్యూ ఏజ్ లవ్ స్టోరీ ప్లాన్ చేస్తున్నారట మణి . అది కూడా ఒక కొత్త యంగ్ హీరో అండ్ హీరోయిన్ తో.. అంతేకాదు అతి తక్కువ బడ్జెట్లో వేగంగా పూర్తయ్యేలా ఈ లవ్ ఎంటర్టైనర్ ఉంటుందని చెన్నై టాక్. త్వరలో అనౌన్స్ మెంట్ ఇవ్వాలని చూస్తున్నారట. మణిరత్నం సినిమాలో రొమాన్స్ అంటే ఒకప్పుడు తెరమీద కవిత చదువుతున్న భావన కలిగేది. మరి ఈ వయసులో కూడా అదే ఇంపాక్ట్ ఇచ్చేలా కథ తీసుకుంటారేమో చూడాలి.