Mani Ratnam: మణిరత్నం కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్.. ఇదే ఆ పేరు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mani Ratnam: స్టార్ డైరెక్టర్ మణిరత్నం తన కొత్త సినిమాకు టైటిల్‌ను తాజాగా ప్రకటించారు. విజయ్ సేతుపతి, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘ఇంజివెల్లం’ (Inji Vellam) అనే పేరును ఫిక్స్ చేశారు. మలయాళంలో ‘ఇంజి వెల్లం’ అంటే తెలుగులో ‘అల్లం నీరు’ అని అర్థం. టైటిల్‌తోనే మేకర్స్ ఈ సినిమాపై ఆసక్తిని పెంచారు. మణిరత్నం మార్క్‌కు తగ్గట్టుగా ఈ మూవీని ఓ వైవిధ్యమైన రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా విడుదలైన ప్రచార చిత్రాన్ని పరిశీలిస్తే.. కథకు కోల్‌కతా నగరం నేపథ్యంగా ఉండనున్నట్లు అర్థమవుతోంది. అయితే ఈ సినిమా స్టోరీకి సంబంధించిన పూర్తి వివరాలను చిత్రబృందం ఇంకా వెల్లడించలేదు.
విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తన నటనతో మెప్పించే విజయ్ సేతుపతి, న్యాచురల్ యాక్టింగ్‌కి పేరున్న సాయిపల్లవి తొలిసారి మణిరత్నం దర్శకత్వంలో కలిసి నటిస్తుండటం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా మారింది. వీరిద్దరి కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో ఇప్పటికే ఆసక్తి నెలకొంది. మరోవైపు ఈ చిత్రానికి మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. మణిరత్నం – ఏఆర్ రెహమాన్ కాంబినేషన్‌కు ప్రత్యేకమైన క్రేజ్ ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం టైటిల్ అనౌన్స్మెంట్తోనే ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు ఎప్పుడు వెల్లడిస్తారనే ఆసక్తి ప్రస్తుతం అభిమానుల్లో నెలకొంది. విజయ్ సేతుపతి, సాయిపల్లవి నటనతో పాటు మణిరత్నం డైరెక్షన్, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
Also Read
- Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
- Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో...
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
- Slum Dog Glimpse: అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి, అడుక్కోవడానికి కాదు.. కన్నీళ్లు పెట్టిస్తున్న ‘స్లమ్ డాగ్’ గ్లింప్స్!
#InjiVellam #ManiRatnam @arrahman #Subaskaran @MadrasTalkies_ @LycaProductions @VijaySethuOffl @Sai_Pallavi92 @sreekar_prasad #AvikMukhopadhayay @ekalakhani #SharmishtaRoy @BrindhaGopal1 @dhilipaction @AmbadyRanjith @bagapath @gkmtamilkumaran @sonymusicsouth @NetflixIndia… pic.twitter.com/jjJoEjvr3H
— Lyca Productions (@LycaProductions) September 7, 2026
తాజావార్తలు
-
TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
-
Bhu Bharati: రైతులకు ఊరట.. భూ సమస్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.!
-
El Nino : తెలంగాణలో సెప్టెంబర్ సెగ.. 2 రోజుల్లో మరో 2 డిగ్రీలు పెరిగే ఛాన్స్.!
-
Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
-
Nepal Floods: నేపాల్‌లో జల ప్రళయం.. విరిగిపడ్డ కొండచరియలు.. మూడు రోజుల్లో ఎంత మంది చనిపోయారంటే!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!