NTV Telugu Site icon

Kamal Haasan: ‘థగ్‌లైఫ్‌’ మూవీతో మణిరత్నం అద్భుతం చేయబోతున్నాడు..

Thug Life

Thug Life

కమల్‌హాసన్‌ హీరోగా, మణిరత్నం దర్శకత్వంలో తేరకెక్కిన చిత్రం ‘థగ్‌లైఫ్‌’ . 1987లో వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘నాయకన్‌’ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలిసిందే. మళ్లీ 38 ఏళ్ల తర్వాత ఇద్దరూ కలిసి ‘థగ్‌లైఫ్‌’ కోసం పనిచేస్తున్నారు. ఇందులో శింబు, త్రిష, నాజర్‌, అభిరామి, జోజూజార్జ్‌, అశోక్‌ సెల్వన్‌, ఐశ్వర్య లక్ష్మి, మహేశ్‌ మంజ్రేకర్‌, అలీ ఫజల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దాదాపు చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో ఉంది. వేసవి కానుకగా జూన్‌ 5న మూవీ విడుదల చేయనున్నారు. అయతే ఇటీవల ఓ ఈవెంట్‌లో పాల్గొన్న కమల్ హాసన్ ఈ మూవీ గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు..

Also Read: kangana : నా గురించి మాట్లాడే అర్హత నీకు లేదు

‘ ‘థగ్‌లైఫ్‌’ ఓ మల్టీస్టారర్‌ మూవీ అని చెప్పాలి.  అగ్ర నటులు, యువ నటుల కలయికగా సినిమా తీయాలన్నది మణిరత్నం ఆలోచన. ఈ విషయాన్ని నాతో పంచుకున్న వెంటనే నాకు నచ్చింది. అలాంటివాళ్లనే ఈ మూవీలో భాగం చేశారు.  ఇందులో చాలా పాత్రలున్నాయి. మలయాళం, హిందీ, తెలుగు సినిమాల్లోని విలక్షణ నటినటులు ఈ మూవీలో కీలక పాత్రలో కనిపిస్తారు. ప్రతి ఒక్కరిలో ఒక్కో టాలెంట్‌ ఉంది. అద్భుతమైన ప్రతిభ కలిగిన నటులు మన వద్ద ఉన్నారు. అందువల్లే ఇది మల్టీస్టారర్‌ అయింది’ అని కమల్‌హాసన్‌ పేర్కొన్నారు.