Mani Ratnam : సినిమా.. ఒక వ్యాపారం అయిపోయింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కమల్ హాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘థగ్ లైఫ్’. త్రిష కథానాయిక. అభిరామి, శింబు కీలక పాత్రల్లో నటించారు. ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా జూన్ 5న ఇది విడుదల కానుంది. ఈ మేరకు ప్రమోషన్స్ కూడా పెంచేశారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పాటలు, టీజర్, ట్రైలర్ అన్నీ కూడా జనాల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి. తాజాగా మీడియాతో ముచ్చటించారు మూవీ టీం. ఆ కార్యక్రమంలో భాగంగా మణిరత్నం చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి..
దక్షిణాదిలో అందులోనూ కోలీవుడ్‌ల్లో రజనీకాంత్, కమల్‌హాసన్, మణిరత్నం ఇలా చెబుతూ వెళితే ఎంతో మంది స్టార్స్ ఉన్నారు. మరి అయినా కూడా ఎందుకు రూ.1000 కోట్ల (బాక్సాపీస్ కలెక్షన్స్) సినిమాలు చేయడం లేదు? అని విలేకరులు ప్రశ్నించగా మణిరత్నం తన అభిప్రాయాన్ని తెలియజేశారు.. ‘భారీ కలెక్షన్స్ రాబట్టే సినిమాలు చేయడం ముఖ్యమా? లేదంటే ప్రేక్షకుల మదికి చేరువయ్యే సినిమాలు చేయడం ముఖ్యమా? ఆలోచించండి. ఒక్కప్పుడు సినిమాలు అద్యంతం ప్రేక్షకులను అలరించేవి. కానీ, ఇప్పుడు అలా లేదు మొత్తం మూడు గంటల సినిమాల్లో కొన్ని అంశాలు మాత్రమే ప్రేక్షకులకు నచ్చుతున్నాయి. అది కాకుండా, అప్పట్లో ఏదైనా సినిమా విడుదలైతే ప్రేక్షకులు అందులో కంటెంట్ ఏమిటి? దానిని ఎలా తెరకెక్కించారు అనే దానిపై దృష్టి పెట్టేవారు.. కానీ ఇప్పుడు అలా కాదు. అంతా వ్యాపార కోణంలో చూస్తున్నారు. రానున్న రోజుల్లో సినిమా క్వాలిటీని దెబ్బతీసే విధంగా ఇది మారకూడదని ఆశిస్తున్నా. బాక్సాపీస్ నంబర్ కోసమే సినిమా చేయడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. ప్రేక్షకులకు గుడ్ ఫీల్ మూవీ మాత్రమే ఇవ్వాలి అనుకుంటున్నాను’ అని మణిరత్నం తెలిపారు.
Also Read
- Peddi Nizam : పెద్ది నైజాం బుకింగ్స్ ఓపెన్.. కానీ ఆ థియేటర్స్ ఇంకా పెండింగ్
- Pandu Master: విశాఖలో రోడ్డు ప్రమాదం.. డాన్స్ మాస్టర్ పండు రెండు కాళ్లకు తీవ్ర గాయాలు!
- Prabhas : జెట్ స్పీడ్ లో స్పిరిట్ షూట్.. టీజర్ ఎప్పుడంటే?
- Peddi Ticket Prices Hike: 'పెద్ది' సినిమా టికెట్ ధరల పెంపుకు గ్రీన్ సిగ్నల్.. రోజుకు 5 షోలకు అనుమతి.!
తాజావార్తలు
-
Rohit-Hardik: ముందు బెంగళూరుకు రండి.. రోహిత్, హార్దిక్‌కు బీసీసీఐ అల్టిమేటం!
-
Gold Recycle: మీ ఇంట్లో పాత బంగారం ఉందా? ఈ ఒక్క ట్రిక్‌తో మన జీవితాలే మారిపోవచ్చు!
-
Train Safety Tips: ట్రైన్లో ఫ్రీ వైఫై వాడేవారికి బిగ్ షాక్.. ఈ తప్పు చేస్తే మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ!
-
Peddi Nizam : పెద్ది నైజాం బుకింగ్స్ ఓపెన్.. కానీ ఆ థియేటర్స్ ఇంకా పెండింగ్
-
Pandu Master: విశాఖలో రోడ్డు ప్రమాదం.. డాన్స్ మాస్టర్ పండు రెండు కాళ్లకు తీవ్ర గాయాలు!
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్‌తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!