Site icon NTV Telugu

Mangalavaram 2: ఈసారి మరింత భయపెట్టేలా మంగళవారం 2

Mangalavaram

Mangalavaram

ఆర్ఎక్స్ 100 సినిమాతో సూపర్ హిట్ అందుకుని టాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్ ఎంట్రీ ఇచ్చిన అజయ్ భూపతికి ఆ తర్వాత చేసిన మహాసముద్రం అనే సినిమా పెద్దగా కలిసి రాలేదు. అయితే ఏ మాత్రం నిరాశ చెందకుండా, పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో చేసిన మంగళవారం సినిమా ఆయనకు మరో హిట్ అందించింది. అయితే ఇప్పుడు ఆయన మంగళవారం సినిమాకి సీక్వెల్‌గా మంగళవారం 2 సినిమా రూపొందించే పనిలో ఉన్నాడు. ఈ సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త తెరపైకి వచ్చింది. అదేంటంటే, మంగళవారం సినిమాలో ఒక మహిళ మానసిక రుగ్మత ఆధారంగా సినిమా కథ రాసుకున్నాడు, దానికి కాస్త హారర్ టచ్ ఇచ్చాడు.

Read More: Trivikram Srinivas : సిరివెన్నెల రాసిన ఆ పాటనే అన్నింటికంటే గొప్పది : త్రివిక్రమ్

కానీ ఈ సెకండ్ పార్ట్ విషయంలో మాత్రం రూరల్ డివోషనల్ టచ్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. నిజానికి మనం పల్లెటూర్లకు వెళితే, గ్రామదేవతలు, ఊరి దేవతల ప్రస్తావన వింటూనే ఉంటాం. అలాంటి ఒక గ్రామ దేవత కథ ఆధారంగా ఈ సినిమా కథ రాసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దాదాపు కథ రాయడం పూర్తయిందని, ఒక స్టార్ హీరోయిన్‌ని అప్ప్రోచ్ అయ్యారని, ఆమె నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉందని అంటున్నారు. ఈ సినిమాని అజయ్ భూపతితో కలిసి ఒక బడా నిర్మాణ సంస్థ నిర్మించబోతోంది. ఒకసారి హీరోయిన్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చాక, అధికారికంగా అనౌన్స్ చేసి సినిమాని పట్టాలెక్కించే అవకాశం ఉంది.

Exit mobile version