Site icon NTV Telugu

“మందులోడా” మాస్ సాంగ్ రిలీజ్ చేసిన మెగాస్టార్

Mandhuloda Lyrical Video Song from Sridevi Soda Center

యంగ్ హీరో సుధీర్ బాబు నటిస్తున్న చిత్రం “శ్రీదేవి సోడా సెంటర్”. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. “మందులోడా” అంటూ సాగుతున్న ఈ లిరికల్ సాంగ్ కు మణిశర్మ సంగీతం అందించారు. సాహితీ చాగంటి, ధనుంజయ ఈ మాస్ సాంగ్ కు గాత్రం అందించారు. కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించిన ఈ సాంగ్ ను ఉత్తరాంధ్ర ఫోక్ సాంగ్ నుంచి ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు. ఈ డ్యాన్స్ నంబర్ ప్రస్తుతం మాస్ ఆడియన్స్ దృష్టిని బాగా ఆకర్షిస్తోంది.

Read Also : షూటింగ్ పూర్తి చేసిన శర్వా, సిద్ధార్థ్

“శ్రీదేవి సోడా సెంటర్‌”కు ‘పలాస’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో విజయ్ చిల్లాద్, శశి దేవిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో సుధీర్ బాబు సరసన ఆనంది హీరోయిన్ గా నటిస్తోంది. పావెల్ నవగీతం, నరేష్, రఘుబాబు, అజయ్, సత్యం రాజేష్, హర్ష్ వర్ధన్, సప్తగిరి, కళ్యాణి రాజు, రోహిణి తదితరులు ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న “మందులోడా” మాస్ సాంగ్ పై మీరూ ఓ లుక్కేయండి.

Exit mobile version