షూటింగ్ పూర్తి చేసిన శర్వా, సిద్ధార్థ్

ఆర్‌ఎక్స్ 100తో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి రెండవ చిత్రం “మహా సముద్రం”. టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రాల జాబితాలో ఈ చిత్రం కూడా ఉంది. ఎకె ఎంటర్టైన్మెంట్స్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రంలో శర్వానంద్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వారికి జోడిగా హీరోయిన్లు అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ప్రధాన పాత్రధారుల ఫస్ట్ లుక్స్ రిలీజ్ కాగా… అవి సినిమాపై ఆసక్తిని పెంచేశాయి. తాజాగా ఈ చిత్రబృందం మరో అప్డేట్ ను ప్రకటించింది.

Read Also : పాత్రల్లో పరకాయప్రవేశం చేసే గుమ్మడి!

ఈ సినిమా షూటింగ్ విజయవంతంగా పూర్తి కావడంతో గుమ్మడికాయను కొట్టేశారు మేకర్స్. ఈ విషయాన్ని తెలియజేస్తూ శర్వానంద్, సిద్ధార్థ్ ఉత్సాహంగా కన్పిస్తున్న ఓ పోస్టర్ ను వదిలారు. అందులో వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నట్టుగా ఉంది. ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామా విశాఖపట్నం బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతోంది. చైతన్ భరద్వాజ్ సంగీత స్వరకర్త. “మహా సముద్రం” థియేటర్లలోనే విడుదల కానుంది. త్వరలోనే రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-