Suhas Colour Row: నేను తెలుగు ప్రేక్షకులను అనలేదు మహాప్రభో! వివరణ ఇచ్చుకున్న ‘మండాడి’ డైరెక్టర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘మండాడి’ సినిమా సక్సెస్ మీట్లో హీరో సుహాస్ రంగును ఉద్దేశించి దర్శకుడు మతిమారన్ పుగజేంధి చేసిన వ్యాఖ్యలు తెలుగు నాట తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలు మొత్తం తెలుగు ప్రేక్షకులను, టాలీవుడ్‌ను కించపరిచేలా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ మొదలైంది. వివాదం ముదరడంతో అప్రమత్తమైన దర్శకుడు మతిమారన్.. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా దిగొచ్చి వివరణ ఇచ్చారు. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సక్సెస్ మీట్లో సుహాస్ ఎదుర్కొన్న వర్ణ వివక్ష (రేసిజం) గురించి తాను మాట్లాడిన మాటలు కేవలం సుహాస్‌ను కించపరిచిన ‘ఆ ఒక్క వ్యక్తిని’ ఉద్దేశించినవి మాత్రమేనని మతిమారన్ స్పష్టం చేశారు. అంతేతప్ప, తన మాటలు ఏమాత్రం తెలుగు ప్రేక్షకులను, తెలుగు ప్రజలను లేదా సమస్త తెలుగు సినీ పరిశ్రమను ఉద్దేశించినవి కావని అన్నారు. సుహాస్‌కు మద్దతుగా మాత్రమే తాను ఆరోజు అలా మాట్లాడానని, ఒక కమ్యూనిటీని నిందించే ఉద్దేశం తనకు లేనే లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు.
తెలుగు ఇండస్ట్రీపై తనకు ఎంత గౌరవం ఉందో గుర్తుచేస్తూ.. “హైదరాబాద్‌లో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్లోనే నేను బహిరంగంగా ఒక మాట చెప్పాను. ఈరోజు దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమను లీడ్ చేస్తోంది తెలుగు ఇండస్ట్రీనే అని గర్వంగా చెప్పాను. తెలుగు పరిశ్రమ అన్నా, ఇక్కడి ప్రేక్షకులు అన్నా నాకు అపారమైన గౌరవం ఉంది. నాకు, నా ‘మండాడి’ సినిమాకు ఇంతటి అద్భుతమైన ప్రేమను పంచుతున్న తెలుగు ప్రజలకు వ్యతిరేకంగా నేను కావాలని ఎప్పటికీ ఒక్క మాట కూడా మాట్లాడను” అని మతిమారన్ తన వివరణలో పేర్కొన్నారు. ఒకవేళ తన మాటల వల్ల ఎవరైనా నొచ్చుకుని ఉంటే, లేదా తన ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకుని ఉంటే అందుకు తాను మనస్ఫూర్తిగా చింతిస్తున్నానని (Regret) మతిమారన్ విచారం వ్యక్తం చేశారు. తెలుగు సినిమా, తెలుగు ప్రేక్షకుల పట్ల తనకున్న ప్రేమ, ఆప్యాయత, గౌరవం ఎప్పటికీ చెక్కుచెదరవని ఆయన తన ప్రకటనలో ముగించారు. సుహాస్‌కు జరిగిన అవమానానికి స్టాండ్ తీసుకునే క్రమంలో వచ్చిన ఈ చిన్న కమ్యూనికేషన్ గ్యాప్‌ను డైరెక్టర్ వెంటనే గుర్తించి క్లారిటీ ఇవ్వడంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్లేనని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
Also Read
తాజావార్తలు
-
Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?