Site icon NTV Telugu

Suhas: తమిళ్లో జెండా పాతేట్టున్నాడే!

Mandadi

Mandadi

ఆర్‌ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ నుండి 16వ ప్రాజెక్ట్‌గా ‘మండాడి’ హై-ఆక్టేన్ మూవీగా రాబోతోన్న సంగతి తెలిసిందే. ‘సెల్ఫీ’ ఫేమ్ మతిమారన్ పుగళేంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సూరి, సుహాస్ అద్భుతమైన పాత్రల్ని పోషిస్తున్నారు. ఈ ఇంటెన్స్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ఒక ల్యాండ్‌మార్క్ చిత్రంగా రూపుదిద్దుకుంటోంది. శక్తివంతమైన ప్రదర్శనలు, గొప్ప విజువల్స్, భావోద్వేగభరితమైన కథనంతో ‘మండాడి’ని భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు.

Also Read:NTR Fans: టీడీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రెస్ మీట్ క్యాన్సిల్?

తెలుగు యంగ్ హీరో సుహాస్ తన కెరీర్‌లో మొదటిసారిగా విలన్ పాత్రను పోషిస్తున్నారు. అతని పుట్టినరోజు సందర్భంగా ‘మండాడి’టీం శుభాకాంక్షలు తెలిపింది. ఈ చిత్రం కోసం సుహాస్ తన లుక్స్ మొత్తాన్ని మార్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు వచ్చిన పోస్టర్లు, కొత్త లుక్ ఇప్పటికే దృష్టిని ఆకర్షిస్తున్నాయి. బర్త్ డే విషెస్ చెబుతూ వదిలిన ఈ కొత్త పోస్టర్ కూడా అందరినీ మెప్పించేలా ఉంది.పోస్టర్ చూస్తుంటేనే సుహాస్ తమిళ్ ఫ్లేవర్ బాగా ఒంటబట్టించుకున్నాడని చెప్పొచ్చు. మొత్తానికి తెలుగు సుహాస్ తమిళ్లో జెండా పాతేట్టున్నాడే! అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.

Also Read:Indian Railway Rule: రైలు ప్రయాణానికి ఎయిర్‌లైన్స్ రూల్.. లగేజీ పరిమితిని మించితే అదనపు ఛార్జీ!

సూరి, సుహాస్‌లతో పాటు మహిమా నంబియార్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. సత్యరాజ్, రవీంద్ర విజయ్, అచ్యుత్ కుమార్ వంటి అనుభవజ్ఞులైన ప్రతిభావంతులు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఈ మూవీకి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు. ఎస్.ఆర్. కతిర్ ఐ.ఎస్.సి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. పీటర్ హెయిన్ తీవ్రమైన యాక్షన్ సన్నివేశాలను కంపోజ్ చేస్తున్నారు

Exit mobile version