NTV Telugu Site icon

Manchu Vishnu: సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది.. వివాదాల నడుమ మంచు విష్ణు సంచలన ట్వీట్

Manchu Vishnu

Manchu Vishnu

మంచు ఫ్యామిలీలో ఏర్పడిన వివాదం గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు. మంచు మోహన్ బాబు, మంచు విష్ణు ఒక వర్గంగా ఏర్పడగా మనసు మనోజ్ వారికి వ్యతిరేకంగా పోరాడుతున్నాడు. హైదరాబాద్ మోహన్ బాబు జల్పల్లి నివాసం కేంద్రంగా జరిగిన కొన్ని వివాదాస్పద ఘటనలు సంచలనం రేకెత్తించగా ఇప్పుడిప్పుడే ఆ ఘటనలు చల్లారాయి. అయితే తాజాగా తిరుపతి కేంద్రంగా కొన్ని సంఘటనలు చోటుచేసుకున్నాయి. తిరుపతిలో ఉన్న మోహన్ బాబు యూనివర్సిటీని మంచు మనోజ్ సందర్శించేందుకు వెళ్లడంతో పోలీసులు నోటీసులు ఇచ్చారు. శాంతి భద్రతల దృష్ట్యా మీరు లోపలికి వెళ్ళకూడదని చెబితే తన తాత నానమ్మల సమాధిని దర్శించుకోవడానికి వెళుతున్నానని చెబుతూ మంచు మనోజ్ లోపలికి వెళ్ళాడు.

Anil Ravipudi: నాకు తెలిసిన సినిమా అదే… నేను ఇలాగే చేస్తా.. హేటర్లకు అనిల్ మార్క్ కౌంటర్

ఇలా ఇంత రాద్ధాంతం జరుగుతున్న సమయంలో ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకుంటున్న సమయంలో మంచు విష్ణు తన సోదరుడు మనసు మనోజ్ ను రెచ్చగొట్టే విధంగా ఒక డైలాగ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన తండ్రి హీరోగా నటించిన రౌడీ అనే సినిమాలో ఒక డైలాగుని తాజాగా షేర్ చేశారు. ‘’సింహం అవ్వాలి అని ప్రతి కుక్కకి ఉంటుంది కానీ వీధిలో మొరగడానికి అడవిలో గర్జించడానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలో అయినా తెలుసుకుంటావన్న ఆశ’’ అంటూ తన తండ్రి మోహన్ బాబు చెబుతున్న డైలాగుని షేర్ చేశాడు విష్ణు. ఇది రౌడీ సినిమాలో తనకు ఫేవరెట్ డైలాగ్ అని చెప్పుకొచ్చారు మొదలుపెట్టి 50 ఏళ్ళు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ డైలాగ్ షేర్ చేసినట్లు పేర్కొన్న విష్ణు ఈ సినిమాలో ఉన్న ప్రతి డైలాగు ఒక స్టేట్మెంట్ అంటూ కామెంట్ చేశారు.