Site icon NTV Telugu

Vishnu: మంచు విష్ణు తదుపరి చిత్రానికి డైరెక్టర్ ఫిక్స్.. !

Manchu Vishnu

Manchu Vishnu

‘కన్నప్ప’ విజయంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన హీరో మంచు విష్ణు, తన కెరీర్‌ను మరోసారి ట్రాక్‌పైకి తీసుకొచ్చేందుకు రెడి అయ్యారు. ప్రస్తుతం మంచి జోష్‌లో ఉన్న ఆయన తదుపరి సినిమాపై పూర్తి ఫోకస్ పెట్టారు. ఇక ఇసారి పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌తో రాబోతున్నట్లుగా విష్ణు ఇప్పటికే ప్రకటించగా, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం. విష్ణు తన తదుపరి సినిమాకు ప్రముఖ నటుడు, స్టార్ కొరియోగ్రాఫర్‌ ప్రభుదేవా దర్శకత్వం వహించనున్నట్టు తెలుస్తోంది. తెలుగు ప్రేక్షకులకు ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘పౌర్ణమి’, ‘శంకర్‌దాదా జిందాబాద్‌’ వంటి చిత్రాల ద్వారా దర్శకుడిగా దగ్గరైన ప్రభుదేవా, కొంత గ్యాప్ తర్వాత మళ్లీ మెగాఫోన్ పెట్టబోతున్నారు.

Also Read : Dil Raju : దిల్ రాజుతో కలిసి ఉండటంపై ఆయన భార్య షాకింగ్ కామెంట్స్..

ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రం, పూర్తి వినోదాత్మకంగా సాగుతుందని సమాచారం. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంస్థ నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ ఈ ఏడాదిలోనే ప్రారంభం కానుంది. విశేషమేమిటంటే మంచు విష్ణు, ప్రభుదేవా కాంబినేషన్ టాలీవుడ్‌లోకి ఓ కొత్త ఎనర్జీని తెచ్చేలా కనిపిస్తోంది. కొరియోగ్రాఫర్‌గా, దర్శకుడిగా,యాక్టర్ గా కూడా తనకంటూ ఒక మార్కెట్ సంపాదించుకున్న ప్రభుదేవా మొత్తానికి చాలా అంటే చాలా రోజుల తర్వాత మంచి కంమ్ బ్యాక్ ఇవ్వబోతున్నాడు. మరి విష్ణుకు ఈ సినిమా మరో మేజర్ హిట్‌గా నిలుస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. నటీనటులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

Exit mobile version