NTV Telugu Site icon

Manchu Family : మంచు మనోజ్‌ షాకింగ్ కామెంట్స్.. పోరాటం ఆగదు

Manchufamily (2)

Manchufamily (2)

మంచు ఫ్యామిలీలో రేగిన ఆస్థి తగాదాల వ్యవహారం మరింత ముదిరింది. నిన్న జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటికి విష్ణు తరపున 40 మంది బౌన్సర్లు, మనోజ్ తరపున 30 మంది బౌన్సర్లతో సినిమాల్లో వచ్చే ఇంటర్వెల్ ఫైట్ ను తలపించే దృశ్యాలు మోహన్ బాబు ఇంటి వద్ద కనిపించాయి. నువ్వా నేనా అనే రేంజ్ లో అటు మోహన్ బాబు ఇటు మంచు మనోజ్ తండ్రి కొడుకుల సమరానికి కాలు దువ్వారు.

Also Read : Legally Veer : రియల్ కోర్ట్ డ్రామా గా వస్తున్న‘లీగల్లీ వీర్’

కాగా ఈ వ్యవ్యహారంపై మంచు మనోజ్ ఏ రోజు మీడియా సమక్షంలో కీలక వ్యాఖ్యలు చేసారు. మనోజ్ మాట్లాడుతూ ” నేను డబ్బు కోసమో ,ఆస్తి కోసమో ఈ పోరాటం చేయటం లేదు. ఆత్మ గౌరవం కోసం పోరాటం చేస్తున్నాను. ఒక మగాడిగా నాతో ఎంత గొడవపడిన పర్వాలేదు, కానీ భార్య, 7 నెలల పాపాను ఈ వివాదంలోకి లాగడం కరెక్ట్ కాదు. నా బిడ్డలు ఇంట్లో ఉండగా ఇలా చేయడం సరికాదు. నేను పోలీసుల దగ్గరకు వెళ్లి రక్షణ కోరాను, మీర దైర్యంగా ఉండండి మేము మీకు రక్షణ కల్పిస్తాం అని చెప్పిన ఎస్సై ఈ రోజు ఓ కానిస్టేబుల్ ను పంపి మా వాళ్ళను లోనికి రానివ్వకుండా, బెదించడం ఏంటి, వాళ్లకు ఆ అధికారం ఎవరిచ్చారు. పోలీసులు ఎందుకు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. న్యాయం కోసం అందరిని కలుస్తా. నా భార్యాపిల్లలకు రక్షణ లేకుండా పోయింది, అందుకే పోరాటం చేస్తున్న’ అని అన్నారు.  మరోవైపు . గత కొద్దీ రోజులుగా విదేశాల్లో ఉన్న మంచు విష్ణు ఈ తెల్లవారు జామున  హైదరాబాద్ చేరుకున్నారు. ఈ వ్యవహారంపై విష్ణును ప్రశ్నించగా అనవసరంగా న్యూసెన్స్ చేయద్దని సమాధానం చెప్తు వెళ్లిపోయారు.

Show comments