హీరో తేజ సజ్జా బ్రహ్మండ్ బ్లాక్ బస్టర్ ‘మిరాయ్’కి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. రాకింగ్ స్టార్ మనోజ్ మంచు పవర్ ఫుల్ పాత్ర పోషించారు. రితికా నాయక్ హీరోయిన్ గా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించగా సెప్టెంబర్ 12న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకుని అద్భుతమైన కలెక్షన్స్ తో హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ విజయవాడలో బ్రహ్మాండ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ సెలబ్రేషన్ నిర్వహించారు. అయితే ఈ క్రమంలో మంచు మనోజ్ మాట్లాడుతూ నేను ఈ వేదిక మీద ఉండడానికి కారణం డైరెక్టర్ కార్తీక్. ఆయన చిన్నవారైనా సరే ఆయన టాలెంట్ కి పాదాభివందనం. ఈ సినిమా చూసిన తర్వాత మా అమ్మ నన్ను పట్టుకుని చాలా ఎమోషనల్ అయిపోయారు.
Also Read:CJI BR Gavai: “విష్ణువు”పై సీజేఐ గవాయ్ వాఖ్యలు వివాదాస్పదం.. రాష్ట్రపతికి న్యాయవాది లేఖ..
ఎన్నో సంవత్సరాల తర్వాత నా విషయంలో మా అమ్మ కళ్ళల్లో ఆనందం చూశాను. అందరికీ ఫోన్ చేసి మా అబ్బాయి హిట్ కొట్టడని చెప్తుంటే చాలా ఆనందంగా అనిపించింది. అలాగే మా అక్క కూడా చాలా ఆనంద పడింది. నా ఫ్యామిలీ అంతా కలిసి సినిమా చూస్తుంటే ఆ అనుభూతి జీవితంలో మర్చిపోలేను. నా విజయాన్ని మీ విజయంగా తీసుకుంటూ నన్ను ముందుకు నడిపిస్తున్న అభిమానులకు స్నేహితులకు అందరికీ పాదాభివందనం. ఎన్ని జన్మలెత్తినా ఈ అభిమానం ఉంటే చాలు. నెక్స్ట్ డేవిడ్ రెడ్డి సినిమా చేయబోతున్నాను. అలాగే టి సిరీస్ వాళ్లతో అబ్రహం లింకన్ అనే సినిమా చేస్తున్నాను. రక్షక అనే సినిమా చేస్తున్నాను. మీ అందరి అభిమానం ఆప్యాయత ఆశీర్వాదం ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. నా తమ్ముడు తేజ సజ్జ ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళాలని భగవంతుని కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు.
