NTV Telugu Site icon

Manchu Manoj: నారా లోకేష్ ను కలిసిన మంచు మనోజ్

Manchu Manoj

Manchu Manoj

గత కొద్ది రోజులుగా హాట్ టాపిక్ అవుతున్న మంచు మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ నిన్న జల్లికట్టు కార్యక్రమంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో ఆయన జల్లికట్టు కార్యక్రమంలో పాల్గొన్నారు. మంచు మనోజ్‌కు టిడిపి, జనసేన, ఎన్టీఆర్ అభిమానులు గ్రాండ్ వెల్‌కమ్ పలికారు. అభిమానులు పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చి గజమాలతో మంచు మనోజ్‌ను ఆహ్వానించారు. టిడిపి, జనసేన, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో డప్పులతో, బాణసంచాలతో అంగరంగ వైభవంగా మొదలైన ఈ జల్లికట్టు వేడుకలలో పశువులను అందంగా అలంకరిస్తూ ఊరంతా ఊరేగింపుగా జరుపుకుంటారు.

Chhaava: రోజు రోజుకీ పెరుగుతున్న “ఛావా” క్రేజ్

ఈ వేడుకలకు హీరో మంచు మనోజ్ ముఖ్య అతిథిగా హాజరవడంతో.. యూత్ అంతా ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొని, గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవడంపై హీరో మంచు మనోజ్ సంతోషం వ్యక్తం చేశారు. ఆ తర్వాత మంచు మనోజ్ ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ను కలిశారు నారా లోకేష్ ఈరోజు కుటుంబంలో కలిసి కుంభమేళాకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆయన రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న విషయం తెలియడంతో మంచు మనోజ్ వెళ్లి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కొన్ని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.