NTV Telugu Site icon

Manchu Manoj: విష్ణుకి మనోజ్ ఛాలెంజ్.. నేను ఒక్కడినే ఏ ప్లేస్ కైనా వస్తా!

Manchu

Manchu

మంచు బ్రదర్స్‌ మధ్య ట్వీట్స్‌ వార్‌ మొదలైంది. మొన్నటి వరకు మీడియా ముఖంగా కొట్టుకున్న ఈ అన్నదమ్ములు ఇప్పుడు ట్విట్టర్ యుద్ధం మొదలు పెట్టారు. ముందుగాతాను నటించిన రౌడీ చిత్రంలోని ఓ డైలాగ్‌ ఆడియోను ట్వీట్‌లో షేర్‌ చేసిన మంచు విష్ణు, తన ఫేవరేట్‌ డైలాగ్స్‌లో ఇది ఒకటని చెప్పారు. “‘సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది..కానీ వీధిలో మొరగటానికి.. అడవిలో గర్జించటానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలోనైనా తెలుసుకుంటావన్న ఆశ’ అనే డైలాగ్‌ షేర్ చేశారు. తరువాత అదే డైలాగుల్లో ఫ్రాడ్ కుక్క అంటూ మనోజ్ కూడా వాడారు. ఇక పేరు ప్రస్తావించకుండా తాజాగా విష్ణు పై ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు మనోజ్.

Chiranjeevi: నీలో ఇంత ఆవేదన ఉందా? ట్రోలర్స్ పై థమన్ కామెంట్స్ పై స్పందించిన చిరంజీవి

రండి ఇద్దరం కలిసి కూర్చొని మాట్లాడుకుందాం, నేను ఒక్కడినే వస్తాను ఏ ప్లేస్ కైనా వస్తాను అని పేర్కొన్నాడు. ఎవర్నో అడ్డం పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు, నాన్నని, మహిళలను , సిబ్బందిని అడ్డం పెట్టుకొని మాట్లాడవలసిన అవసరం లేదు అంటూ చెప్పుకొచ్చాడు. మన వద్ద ఉన్న సమస్యని ఒక పరిష్కారం తీసుకొని వద్దాం, ఆరోగ్యకరమైన వాతావరణంలో చర్చలు జరుపుకుందాం అంటూ చెప్పుకొచ్చాడు. మరి దీనిపై విష్ణు ఇంకా స్పందించలేదు. నిన్న బెంగళూరులో కన్నప్ప ప్రెస్ మీట్ పెట్టగ ఈరోజు చెన్నైలో పెడుతున్నాడు విష్ణు.