NTV Telugu Site icon

Manchu Lakshmi: మంచు వివాదం.. లక్ష్మీ కీలక సోషల్ మీడియా పోస్ట్

మంచు ఫ్యామిలీ వివాదం నేపథ్యంలో మంచు లక్ష్మి సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టింగులు హాట్ టాపిక్ అవుతున్నాయి. నిన్న తన కుమార్తె వీడియోని ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన ఆమె శాంతి అంటూ క్యాప్షన్ పెట్టగా ఈ రోజు మరో ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఒక ఫేమస్ తత్వవేత్త చెప్పిన ఒక కొటేషన్ ని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ప్రపంచంలో ఏదీ నీకు సంబంధించింది కానప్పుడు కోల్పోతావని భయపడడం ఎందుకు అంటూ ఆమె క్యాప్షన్ షేర్ చేసింది.

Rajinikanth: రజినీకాంత్‌కు గుడి.. పాలాభిషేకం!!

నిజానికి ఆమె ఎందుకు ఈ క్యాప్షన్ షేర్ చేసిందో తెలియదు. కానీ నెటిజెన్లు మాత్రం ఇదే కొటేషన్ నీ తండ్రికి తమ్ముళ్లకు షేర్ చేయమని కామెంట్ చేస్తున్నారు. మరి కొంత మంది కొన్నాళ్లపాటు మీడియాకి సోషల్ మీడియాకి దూరంగా ఉండండి, అనవసరమైన కొటేషన్లు షేర్ చేస్తే మరింత బాధ పడాల్సి వస్తుంది అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇంకొంతమంది మాత్రం స్ట్రాంగ్ గా ఉండండి అంటూ ఆమెకు అభయం ఇస్తున్నారు.

Show comments