NTV Telugu Site icon

Manchu Lakshmi: ముంబైకి మకాం.. ఎందుకో చెప్పిన మంచు లక్ష్మి

Manchu Lakshmi

Manchu Lakshmi

మంచు వారి అమ్మాయి లక్ష్మి ప్రసన్న హైదరాబాద్‌ వదిలి ముంబైకి మకాం మార్చిన సంగతి తెలిసిందే. ఉన్నట్టుండి ఆమె ముంబైకి షిఫ్ట్‌ అవ్వడంతో అంతా ఆలోచనలో పడ్డారు. సౌత్‌లో వరుసగా సినిమాలు చేస్తున్న ఆమె సడెన్‌గా ముంబై వెళ్లడానికి కారణం ఏమై ఉంటుందా? అని ఎవరికి తోచినట్టు వారు ఊహించుకుంటున్నారు. ఈ అంశంపై ఎన్నో గాసిప్స్‌ పుట్టుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాను ముంబై వెళ్లడానికి కారణం ఎంటో స్వయంగా చెప్పింది మంచు లక్ష్మి.

Also Read: Game Changer: అరేయ్.. ఆ లీకులు ఆపండ్రా.. సినిమా మీద ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది

రీసెంట్‌గా ఓ నేషనల్‌ మీడియాతో ముచ్చటించిన ఆమె మాట్లాడుతూ.. ‘పదేళ్లు ముంబైలో ఉన్నా. అక్కడ నేను అందరికి తెలుసు. బయటకు వెళితే ఫ్యాన్స్‌ కళ్లు అన్ని నాపైనే ఉంటాయి. కానీ ఇక్కడ నేను కెరీర్‌ ఫస్ట్‌ నుంచి స్టార్ట్ చేయాలి. నిజానికి ఇలాంటి ఛాలేంజెస్‌ అంటే నాకు ఇష్టం. ఎప్పుడు ఒకేచోట ఉంటే నాకు బోర్‌ కోడుతుంది. ఇక్కడ నన్ను నేను కొత్త పరిచయం చేసుకోవాల్సి ఉంంటుంది’ అని చెప్పింది. ఆ తర్వాత ‘హైదరాబాద్‌లో నాతో పాటు నా తమ్ముడు (మనోజ్‌) ఉండేవాడు. తన పెళ్లి అయిపోయాక వెళ్లిపోయాడు.

Also Read: 3 Trains on One Track: వందేభారత్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. ఒకే ట్రాక్‌పై మూడు రైళ్లు

ఆ తర్వాత నాకు లోన్లీ ఫీలింగ్‌ వచ్చింది. అదే టైంలో ఒకసారి నా ఫ్రెండ్‌ రానాకి(హీరో దగ్గుబాటి రానా) ఫోన్‌ చేశాను. అతడు తన బిజినెస్‌ గురించి చాలా సిరీయస్‌గా మాట్లాడుతున్నారు. అప్పుడు నాకు భయం వేసింది. నేను ఏంటీ? ఎక్కడ ఉన్నాను? అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. అప్పుడే నేను హైదరాబాద్‌ వదిలే టైం వచ్చిందని డిసైడ్‌ అయ్యా. అలా ముంబై వచ్చాను’ అని తెలిపింది. ఇక ముంబై ఇల్లు దొరకడం చాలా కష్టమని, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ వల్ల తనకు ఆ పని చాలా ఈజీ అయిపోందని చెప్పింది. తన కోసం రకుల్‌ దాదాపు 100 అపార్టుమెంట్స్‌ చూసి పెట్టిందని, తాను ముంబై వచ్చాక వారం రోజులకు అందులో బెస్ట్‌ సెలక్ట్‌ చేసుకున్నానంటూ మంచు లక్ష్మి చెప్పుకొచ్చింది.

Show comments