Site icon NTV Telugu

Manchu Lakshmi : ఫిల్మ్ ఛాంబర్‌లో కలకలం.. సీనియర్ జర్నలిస్ట్‌పై మంచు లక్ష్మి ఫిర్యాదు

Manchu Laxmi

Manchu Laxmi

తాజాగా మంచు మోహన్‌బాబు కుమార్తె మంచు లక్ష్మి సీనియర్ సినీ జర్నలిస్ట్ పై ఫిర్యాదు చేశారు. ఆమె ‘దక్ష’ చిత్ర ప్రమోషన్స్‌ సందర్భంలో, ఒక ఇంటర్వ్యూలో ఈ సీనియర్ సినీ జర్నలిస్ట్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో భాగంగా ఆమెను .. “50 ఏళ్లకు దగ్గరగా ఉన్న మీరు ఇలాంటి డ్రెస్సులు ఎందుకు వేసుకుంటున్నారు?” అని ప్రశ్నించారు జర్నలిస్ట్. దానికి మంచు లక్ష్మి తీవ్రంగా విరుచుకుపడింది.. “మహేశ్ బాబుకి కూడా 50 ఏళ్లే వచ్చాయి. మీరు షర్ట్ ఎందుకు విప్పి తిరుగుతున్నావో అడగగలరా? ఆడపిల్లను ఇలా ప్రశ్నించడం జర్నలిజం కాదు, ఇది అవమానం” అని పేర్కొన్నారు. అయితే ఈ విషయాన్ని మంచు లక్ష్మి అక్కడితో వదిలేయలేదు. జర్నలిస్ట్ పై తాజాగా ఫిల్మ్ ఛాంబర్‌కి ఫిర్యాదు చేసింది.

Alsdo Read : Shiva Re-Release : కింగ్ నాగ్ ‘శివ’ రీరిలీజ్ డేట్ ఫిక్స్..!

‘ నాలుగు సంవత్సరాల తర్వాత, నేను నిర్మించిన సినిమాతో కాకుండా, నా తండ్రి, లెజెండరీ మోహన్ బాబు గారితో కలిసి నటించే గౌరవప్రదమైన ప్రాజెక్ట్‌ను ప్రమోట్ చేస్తున్న సందర్భంలో, మేము సీనియర్ జర్నలిస్ట్ గారికి ఇంటర్వ్యూ ఇచ్చాం. కానీ ఆ ఇంటర్వ్యూ దురదృష్టవశాత్తూ వ్యక్తిగత దాడిగా మారింది. అతను నా వయస్సు, శరీరం, దుస్తులపై ప్రశ్నలు అడిగి, నా వ్యక్తిగతంగా అవమాన పరిచే విధంగా ప్రవర్తించాడు. ఈ ప్రశ్నలలో నా పని, సినిమా లేదా ప్రాజెక్ట్ గురించి ఏ రకమైన ఉద్దేశం లేదని స్పష్టంగా ఉంది. కేవలం నన్ను తగ్గించడానికి, కించపరచడానికి, రెచ్చగొట్టడానికి ఆయన ప్రవర్తించారు.

నేను జర్నలిజం పట్ల గౌరవం ఉంచుతున్నాను. నిజాయితీతో చేసే జర్నలిజం సమాజానికి సమాచారం, మార్పు, ప్రేరణ కలిగిస్తుంది. అయితే వృత్తిని దుర్వినియోగం చేసి, ఒక వ్యక్తి గౌరవాన్ని పణంగా పెట్టి ‘వైరల్’ కావాలని ప్రయత్నించడం అంగీకారానికి వ్యతిరేకం. ఇది వృత్తిపరమైనదే కాక, మహిళల భద్రతకు ప్రమాదకరమైన ప్రవర్తన. కాబట్టి, ఫిల్మ్ ఛాంబర్ ఇలాంటి సంఘటనలకు ప్రతిబంధకాలు ఏర్పాటు చేసి, భవిష్యత్తులో మేము ఎదుర్కొనే మహిళలపై ఇలాంటి ప్రశ్నలు, అవమానాలను ఆపే విధంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను’ అని పిర్యాదు లో పేర్కొంది. అంతే కాదు..
మంచు లక్ష్మి ఫిర్యాదు ప్రకారం, ఆ జర్నలిస్ట్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని, మరలా ఇలాంటి ప్రశ్నలు వేయకుండా ఫిల్మ్ ఛాంబర్ కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ వ్యవహారం సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. నెటిజన్లు, అభిమానులు కూడా లక్ష్మి అభిప్రాయానికి మద్దతు తెలిపి, “ఇలాంటి జర్నలిస్టుల ఆటలకు ఇది ముగింపు పలకాలని” అని కామెంట్ చేస్తున్నారు.  ప్రస్తుతం మంచు లక్ష్మీ ఫిర్యాదు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Exit mobile version