Site icon NTV Telugu

MSVG : ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఓవర్సీస్ రివ్యూ.. అనిల్ రావిపూడి దొరికేశాడా?

Mana Shankara Vara Prasad Garu

Mana Shankara Vara Prasad Garu

అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన సినిమా ‘మన శంకర వరప్రసాద్ గారు’. నయనతార హీరోయిన్‌గా నటించింది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ తర్వాత అనిల్ రావిపూడి నుంచి వస్తున్న ఈ సినిమాపై ముందునుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను భారీ చిత్రాల నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై సుష్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మించారు. మన శంకరవరప్రసాద్‌ గారు నేడు రిలీజ్ కానున్న నేపథ్యంలో ఓవర్సీస్ రివ్యూ ఓసారి చూద్దాం.

మెగాస్టార్ చిరంజీవి సింపుల్ ఎంట్రీతో స్టార్ట్ అయిన సినిమా..  మొదట చాలా నెమ్మదిగా కదులుతూ ఉంటుంది. కథలోకి వెళ్లే కొద్దీ గాడిన పడుతుంది. మంచి సాంగ్స్, చిరు తన ట్రేడ్‌మార్క్ టైమింగ్‌తో అలరిస్తారు. కామెడీ కొన్ని చోట్ల మెప్పిస్తుంది. అలాగే కొన్ని ఎపిసోడ్స్ చిరు ఒకప్పటి సినిమా ‘డాడీ’ని గుర్తుకుతెస్తుంది. కొత్తగా ఏమీ అనిపించదు కానీ.. అలరిస్తుంది. తనదైన పచులతో వింటేజ్ చిరు గుర్తుకువస్తాడు. హుక్ స్టెప్ సాంగ్ మెగా అభిమానులకు మంచి ట్రీట్ ఇస్తుంది. మొత్తంగా ఫస్టాఫ్ మెప్పిస్తుంది.

Also Read: Shubman Gill: బౌలర్లకు అవకాశాలు.. శుభ్‌మన్ గిల్ ఏమ్మన్నాడంటే?

ఇక సెకండాఫ్ స్టార్ట్ అయిన కాసేపటికే ఏదో తేడా కొడుతుందే అనే ఫీల్ తెస్తుంది. ప్రథమార్ధంలో ఉన్న వేగం ద్వితీయార్ధంలో కనిపించదు. కథ నెక్ట్స్ ఏమి జరగబోతుందో ఇట్టే తెలిసిపోతుంది. కొత్తగా ఏమీ అనిపించక పోగా.. రొటీన్ రెగ్యులర్‌గా బోర్ ఫీల్ అనిపిస్తుంది. చివరలో ‘విక్టరీ’ వెంకటేష్ రంగప్రవేశంతో ఉత్సాహం వస్తుంది. ఆ సీన్లు కూడా ఆహా అనే రేంజ్‌లో ఏముండదు. జస్ట్ ఒకే అనిపిస్తాయి. క్లైమాక్స్ అయితే రొటీన్‌గా.. గతంలో చాలా సినిమాలలో చూసేసిన ఫీల్ వస్తుంది. ఓవరాల్‌గా ‘సంక్రాంతికి వస్తున్నాం’ రేంజ్ కాదు కానీ.. F3 సినిమాలా ఓ మోస్తరు కామెడీ సినిమా.  ఎప్పుడు కామెడీతో నెట్టుకొచ్చే అనిల్ రావిపూడి.. ఈసారి దొరికేసాడనే టాక్ ఓవర్సీస్ ఆడియెన్స్ నుంచి వినిపిస్తోంది. 

Exit mobile version