Site icon NTV Telugu

Manam: జపాన్‌లో ‘మనం’ రిలీజ్

Manam

Manam

తెలుగు సినిమా పరిశ్రమలో ఒక ఐకానిక్ చిత్రంగా గుర్తింపు పొందిన ‘మనం’ సినిమా మరోసారి వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. 2014 మే 23న తొలిసారి విడుదలైన ఈ చిత్రం, ఇప్పుడు జపాన్‌లో 2025 ఆగస్టు 8న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా, అక్కినేని నాగార్జున తన జపనీస్ అభిమానులతో వర్చువల్‌గా సంభాషించనున్నారు. ‘మనం’ సినిమా అక్కినేని కుటుంబానికి చెందిన మూడు తరాల నటులను ఒకే తెరపై చూపించిన అరుదైన సినిమా. ఈ సినిమాలో దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వరరావు (ANR), అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ అక్కినేని నటించారు.

Also Read:Coolie Trailer : రజినీకాంత్ కూలీ ట్రైలర్ వచ్చేసింది

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ సినిమా ప్రేమ, పునర్జన్మల చుట్టూ తిరిగే ఒక ఫాంటసీ డ్రామాగా రూపొందింది. సమంత రూత్ ప్రభు, శ్రియ శరణ్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. జపాన్‌లో అక్కినేని నాగార్జునకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అక్కడి అభిమానులు ఆయనను ప్రేమగా ‘నాగ్ సామా’ అని పిలుస్తారు. ఈ రీ-రిలీజ్ ద్వారా, ‘మనం’ సినిమా జపనీస్ అభిమానులకు ఒక సినిమాటిక్ ట్రీట్. నాగార్జున వర్చువల్‌గా ఒక స్క్రీనింగ్‌కు హాజరై, అభిమానులతో సంభాషించనున్నారు. 2014లో విడుదలైనప్పుడు, ‘మనం’ సినిమా తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద దాదాపు 50 కోట్ల రూపాయలు వసూలు చేసి హిట్ అయింది.

Exit mobile version