మలయాళ సూపర్ స్టార్, అగ్ర కథానాయకుడు మమ్ముట్టి ఆరోగ్య సమస్యల నుంచి పూర్తిగా కోలుకున్నారు. తిరిగి సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన నటిస్తున్న ‘పేట్రియాట్’ దర్శకుడు మహేశ్ నారాయణన్ అధికారికంగా ప్రకటించారు. ఈ అప్డేట్‌తో మమ్ముట్టి అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.
Also Read : Megha#158 : మెగాస్టార్ 158 వ సినిమాలో అనుష్క శెట్టి హీరోయిన్? టాలీవుడ్‌లో హాట్ టాపిక్!
మహేశ్ నారాయణన్ మాట్లాడుతూ –“మమ్ముట్టి గారు ఆరోగ్యం బాగానే ఉంది. అక్టోబర్ 1 నుంచి సెట్స్‌లోకి రానున్నారు. ఆయన కోలుకున్నందుకు మా ఆనందాన్ని మాటల్లో చెప్పలేం. రెస్ట్ తీసుకుంటూ కూడా, సినిమా గురించే ఆలోచించారు. నేను ప్రతిరోజూ షూటింగ్ అప్‌డేట్ ఆయనకి ఇచ్చాను. లోకేషన్‌లో లేకపోయినా ఆయన మాతోనే ఉన్నారు,” అని అన్నారు.
మహేశ్ నారాయణన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘పేట్రియాట్’ సినిమాలో మమ్ముట్టితో పాటు మోహన్‌లాల్, ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ స్టార్ కాంబినేషన్ వల్ల సినిమా మీద అంచనాలు భారీగా పెరిగాయి. షూటింగ్ ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే మమ్ముట్టి ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవడంతో తాత్కాలికంగా బ్రేక్ తీసుకున్నారు. ఈ ఏడాది జూన్‌లో మమ్ముట్టి ఆరోగ్యం బాగోలేదని కొన్ని వార్తలు ప్రచారం అయ్యాయి. దీంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. కానీ ఆయన టీమ్ వాటిని కొట్టి పారేసింది. “అవును, కొంత హెల్త్ ఇష్యూ ఉన్నా అది చిన్న సమస్య మాత్రమే. ఆందోళన అవసరం లేదు” అని స్పష్టత ఇచ్చారు. మొత్తనికి ఇప్పుడు మమ్ముట్టి తిరిగి సెట్స్‌లోకి వస్తున్నారన్న వార్తతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
