Site icon NTV Telugu

ఆహాలోకి మమ్ముట్టి ‘డెరిక్ అబ్రహం’, ‘బర్త్ మార్క్’ మూవీస్.. ఎప్పటి నుంచి చూడొచ్చంటే?

Thrillers In Aha

Thrillers In Aha

Mammootty Derick Abraham to Stream in Aha Soon: ఆహా ఓటీటీ మరో రెండు ఎక్సైటింగ్ థ్రిల్లర్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తెచ్చింది. మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన యాక్షన్ థ్రిల్లర్ “డెరిక్ అబ్రహం”. షాజీ పాడూర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంది. షబీర్, మిర్నా మీనన్ లీడ్ రోల్స్ లో నటించిన థ్రిల్లర్ ‘బర్త్ మార్క్’. విక్రమ్ శ్రీధరన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఫిబ్రవరిలో థియేటర్స్ లో రిలీజై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఆర్మీ లెఫ్టినెంట్ డేనియల్ గా షబీర్, అతని భార్య జెన్నిఫర్ గా మిర్నా మీనన్ తమ పెర్ఫార్మెన్స్ లతో ఆదరగొట్టారు.

Balakrishna: ఇండియన్ సినిమాలో అమితాబ్ బచ్చన్ తర్వాత బాలకృష్ణే!!

సీతారామం ఫేం విశాల్ చంద్రశేఖర్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకి మరో స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పొచ్చు. ఇక తాజాగా ఈ రెండు సినిమాలు ‘భవానీ మీడియా’ ద్వారా ఆహాలో రిలీజ్ అయ్యాయి. గురువారం(8th) నుంచి ‘బర్త్ మార్క్’, శనివారం (10th) “డెరిక్ అబ్రహం” ఆహాలో కానున్నాయి. ‘డెరిక్ అబ్రహం’ మూవీ మైండ్ బ్లోయింగ్ యాక్షన్ థ్రిల్లర్ అని కథ, స్క్రీన్ ప్లే, పెర్ఫార్మెన్స్ ఆడియన్స్ కి గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని అందిస్తాయని అంటున్నారు. అలాగే థ్రిల్లర్ డ్రామాగా రూపొందిన బర్త్ మార్క్ ఆడియన్స్ కి సీట్ ఎడ్జ్ థ్రిల్ ఎక్స్ పీరియన్స్ ని అందించనుంది. ఈ రెండు ఎక్సయిటింగ్ మూవీస్ తో ఈ వీకెండ్ ఆహా లో ఎంటర్ టైన్ మెంట్ ఫుల్ గా ఉండబోతోందని చెబుతున్నారు.

Exit mobile version