NTV Telugu Site icon

కరోనాతో ప్రముఖ స్క్రీన్ రైటర్ కన్నుమూత

Malayalam writer and actor Madambu Kunjukuttan dies due to COVID-19

ప్రముఖ స్క్రీన్ రైటర్, నటుడు మాడంపు కుంజుకుట్టన్ మే 11న మంగళవారం కరోనాతో కన్నుమూశారు. ఆయన వయసు 81 సంవత్సరాలు. స్క్రీన్ రైటర్, దర్శకుడు డెన్నిస్ జోసెఫ్ అకాల మరణం నుండి మలయాళ చిత్ర పరిశ్రమ ఇంకా కోలుకోలేనే లేదు. మే 10న దర్శకుడు డెన్నిస్ జోసెఫ్ మరణించారు. అంతలోనే జాతీయ అవార్డు గెలుచుకున్న స్క్రీన్ రైటర్ మాడంపు కుంజుకుట్టన్ ను కరోనా బలి తీసుకోవడంతో మలయాళ చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. మాడంపుకు తీవ్రమైన జ్వరం రావడంతో త్రిశూర్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. తరువాత ఆయన కరోనా బారిన పడినట్లు తెలిసింది. మంగళవారం తుది శ్వాస విడిచాడు. అనేక వృత్తులలో పని చేసిన తరువాత 1979లో మలయాళ చిత్రం ‘అశ్వధామవు’తో మాడంపు  స్క్రీన్ రైటింగ్‌ గా మారారు. 2000 సంవత్సరంలో ‘కరుణం’ అనే చిత్రానికి ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ గా జాతీయ అవార్డును గెలుచుకున్నాడు. మకాల్కు, గౌరిశంకరమ్, సఫలం, దేవదానం తదితర చిత్రాలకు స్క్రీన్ రైటర్ గా పని చేశారు మాడంపు. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ మాడంపు కుంజుకుట్టన్ మృతికి సంతాపం తెలియజేశారు.