Site icon NTV Telugu

‘మిష‌న్ ఇంపాజిబుల్‌’లో మ‌ల‌యాళ న‌టుడు హ‌రీశ్ పేర‌డి

తెలుగు చిత్రసీమలో కెరీర్‌ స్టార్ట్ చేసి బాలీవుడ్‌లో అడుగు పెట్టి స‌క్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ త‌న‌కంటూ ఓ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది తాప్సీ. రీసెంట్‌గా ఈమె టాలీవుడ్‌లో ‘మిష‌న్ ఇంపాజిబుల్‌’ సినిమాలో నటిస్తోంది. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ‌’ చిత్రంతో సూప‌ర్ హిట్ కొట్టిన టాలెంటెడ్ డైరెక్ట‌ర్ స్వ‌రూప్ ఆర్. ఎస్‌. జె ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.

టాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ల్లో ఒక‌టైన మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాలో ఒక అద్భుతమైన రోల్ కోసం ఎన్నో వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో మెప్పించిన మ‌ల‌యాళ న‌టుడు హ‌రీశ్ పేర‌డీ ని ఎంపిక చేశారు దర్శకనిర్మాతలు. మ‌ల‌యాళ చిత్ర‌సీమ‌లో త‌న న‌ట‌న‌తో గుర్తింపు సంపాదించుకోవ‌డమే కాదు, క‌ళ్ల‌తోనే విల‌నిజాన్ని చూపిస్తూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు పొందారు హరీశ్ పేరడీ. ‘ఎరిడ, తంబి, మెర్స‌ల్‌, ఖైదీ, స్పైడ‌ర్‌, రాక్ష‌సి, పులి మురుగన్‌, భూమియిలే, మ‌నోహ‌ర‌, స్వ‌కార్యం, మ‌డ్డి, లెఫ్ట్ రైట్ లెఫ్ట్‌, విక్ర‌మ్ వేద’ ఇలా న‌ల‌బైకి పైగా చిత్రాల్లో ఆయన న‌టించారు. ఈ చిత్రాల‌న్నీ ఆయ‌న‌కు న‌టుడిగా ఎంతో గుర్తింపును తెచ్చి పెట్టాయి.

Exit mobile version