Malai kottai Valiban: మోహన్ లాల్ కు ఊహించని షాక్.. డిజాస్టర్ గా మలైకోట్టై వాలీబన్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Malaikottai Vaaliban turning out to be a Disaster: మలయాళ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో మలైకోట్టై వాలీబన్ అనే సినిమా తెరకెక్కింది. మలయాళంలో పాపులర్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న లిజో జోస్ పెల్లిసరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఆయన అక్కడ చేసిన అంగమలై డైరీస్, జల్లికట్టు, చురల్లీ వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. ఏకంగా మోహన్ లాల్ తో ఈ మలైకోట్టై వాలీబన్ అనే సినిమా అనౌన్స్ చేయడంతో సినిమా మీద ఒక్కసారిగా అందరిలో అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమా మాత్రం దారుణమైన డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. రిలీజ్ అయిన మొదటి ఆట నుంచి ఈ సినిమాకు ఏ మాత్రం మలయాళీల నుంచి స్పందన లభించడం లేదు. నిజానికి ఈ సినిమా ప్రకటించిన సమయంలో పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తారని ప్రచారం జరిగింది. అంతేకాదు టీజర్ ను సైతం ఐదు భాషల్లో రిలీజ్ చేశారు. కానీ సినిమా యూనిట్ మాత్రం ఆసక్తికరంగా కేవలం మలయాళం భాషలో మాత్రమే సినిమాను రిలీజ్ చేసింది.
Abhijeet: మా అమ్మ పెళ్లి చేసుకోమని పోరుపెడుతోంది__
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
కానీ ఈ సినిమా మలయాళ ప్రేక్షకులను సైతం ఏమాత్రం ఆకట్టుకోలేక పోవడం గమనార్హం. ఈ సినిమాకి సెకండ్ పార్ట్ ఉంటుందని చివరిలో లీడ్ ఇచ్చారు. అయితే సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో పాటు కలెక్షన్స్ విషయంలో కూడా బోల్తా పడుతూ ఉండడంతో సెకండ్ పార్ట్ మీద అనుమానాలు ఏర్పడుతున్నాయి. నిన్న 6వ రోజు 15 శాతం ఆక్యుపెన్సీ కూడా నమోదు కాలేదని మలయాళ ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు.. ఈ సినిమా ఫలితం మోహన్ లాల్ కు ఊహించని షాక్ అని చెబుతున్నారు. మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీలోనే ఆల్ టైం క్లాసిక్స్ లో ఒకటిగా నిలిచిన జల్లికట్టు సినిమాని డైరెక్ట్ చేసిన లీజో జోస్ పెల్లిసరీని మోహన్ లాల్ పిలిచి మరీ ఈ సినిమా ఇస్తే రిజల్ట్ ఇలా ఉంటుందని ఎవరూ ఊహించి ఉండరని అంటున్నారు.
తాజావార్తలు
-
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
-
SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
-
Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
-
Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!