NTV Telugu Site icon

Malaika Arora : వయసులో చిన్నవాడు.. తప్పేంటి అంటున్న ముదురు భామ

Arjun Kapoor

Arjun Kapoor

Malaika Arora : బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ నటించిన దిల్ సే సినిమాలోని ఛయ్యా.. ఛయ్యా పాట ద్వారా నటిగా ఎంట్రీ ఇచ్చారు మలైకా అరోరా. ఆ ఒక్క పాటతో ఇండస్ట్రీని తన వైపు తిప్పుకున్నారు. దాంతో నటిగానే కాకుండా పలు చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేస్తూ యువతకు నిద్ర లేకుండా చేశారు. నటి, నిర్మాత, వ్యాఖ్యాత, మోడల్, వీడియో జాకీగా ఆల్ రౌండ్ ప్రదర్శనతో మలైకా అరోరా బాలీవుడ్ లో దూసుకుపోతున్నారు.

Read Also: Prabhas Fans: అభిమానుల అత్యుత్సాహం.. థియేటర్లో మంటలు

అక్టోబర్ 23న తన 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న మలైకా అరోరా సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటారు. ఐదు పదుల వయసు దగ్గరపడుతున్నా.. ఇప్పటికీ తన ఫిట్నెస్ తో అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నారు. సినిమాలతో కంటే వ్యక్తిగత విషయాలతో ఆమె తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది ఈ బ్యూటీ.

Read Also: Mega 154 Title Teaser : మాస్ లుక్‎లో చిరు.. కేక పుట్టిస్తున్న స్టైల్

ఇక వ్యక్తిగత జీవితంలోనూ ఉత్సాహంతో దూసుకుపోతుంది. మాజీ భర్త అర్బాజ్ ఖాన్ తో విడాకులు తీసుకున్న తర్వాత ఈ ముదురు భామ తనకంటే 12ఏళ్లు చిన్న వాడైన నటుడు అర్జున్ కపూర్ తో ప్రేమలో పడింది. అతడితో డేటింగ్ చేస్తోంది. వీరిద్దరూ తరచూ ట్రిప్ లకు, రెస్టారెంట్ లకు వెళ్తూ మీడియా కంట పడుతుంటారు. అయితే ఇటీవల వారి వ్యవహారంపై వచ్చిన కామెంట్లపై మలైకా స్పందించింది. చిన్నవాడితో డేటింగ్ చేస్తే తప్పేంటని ఆన్సర్ ఇచ్చింది. విడాకుల తర్వాత ఒక మహిళ తనకంటూ ఓ జీవితాన్ని క్రియేట్ చేసుకుని స్వశక్తితో ముందడుగు వేయాలంటూ సూచించింది.

Show comments