Ranabaali Postpone : విజయ్ దేవరకొండ ‘రణబాలి’ పోస్ట్‌పోన్ అవుతుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ పిరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’. ‘టాక్సీవాలా’ వంటి సూపర్‌హిట్ చిత్రం తర్వాత వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతుండటంతో ఈ సినిమాపై మొదటి నుంచీ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన గ్లింప్స్‌కి ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించగా సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 16న రిలీజ్ చేస్తామని ఇదివరకే మేకర్స్ అఫీషయల్ గా ప్రకటించారు. కానీ గత కొద్ది రోజులుగా ఈ సినిమా విడుదల వాయిదా వేశారని డిసెంబర్ 3కు పోస్ట్ పోన్ అవుతుందని సోషల్ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. షూటింగ్ ఆలస్యం కావడం, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఇంకా చాలా పెండింగ్ ఉండడం దసరాకు సూపర్ స్టార్ రజని ‘జైలర్ 2’ రిలీజ్ ఉండడం వలన రణబాలి వాయిదా పడే అవకాశం ఉందంటూ కథనాలు వచ్చాయి. దాంతో విజయ్ ఫ్యాన్స్ లో కాస్త డిజప్పోయింట్ అయ్యారు. నెట్టింట పోస్ట్ పోన్ న్యూస్ వైరల్ కావడంతో చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఆ పుకార్లకు స్వస్తి చెప్పింది. ముందుగా ప్రకటించిన విధంగానే ‘రణబాలి’ చిత్రాన్ని అక్టోబర్ 16న గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు నిర్మాతలు స్పష్టం చేశారు. నెట్ ఇంట ప్రచారంలో ఉన్న వార్తలన్నీ కేవలం రూమర్లు మాత్రమేనని, విడుదల తేదీలో ఎలాంటి మార్పూ లేదని తేల్చిచెప్పారు. దీంతో విజయ్ ఫ్యాన్స్ లో జోష్ నెలకొంది.
Also Read
- Kangana vs Rakhi Sawant: రాఖీ సావంత్‌పై కంగనా రనౌత్ ఫైర్.. కనీసం స్వీపర్ ఉద్యోగం కూడా దక్కలేదంటూ షాకింగ్ కామెంట్స్!
- Chiyaan 63 : ఆనంద్ శంకర్ దర్శకత్వంలో 'పవర్ హౌస్'గా విక్రమ్ 63..
- Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
- Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్‌తో చిరంజీవి, రామ్ చరణ్‌కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారంటే?
తాజావార్తలు
-
Ranabaali Postpone : విజయ్ దేవరకొండ ‘రణబాలి’ పోస్ట్‌పోన్ అవుతుందా?
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
UPI Charges: రూ.2,000 వరకు యూపీఐ లావాదేవీలపై.. ఛార్జీల విషయంలో ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ
-
AP Weather Alert: ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలపై అలర్ట్.. పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!