న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ‘మెయిల్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రియదర్శి, హర్షిత్, గౌరీ ప్రియ ప్రధాన పాత్రధారులుగా స్వప్న సినిమాస్ బ్యానర్ లో ప్రియాంక దత్ నిర్మించిన సినిమా ‘మెయిల్’. ఓటీటీ కోసం తీసిన ఈ సినిమాను ఈ యేడాది జనవరిలో సంక్రాంతి కానుకగా ‘ఆహా’లో స్ట్రీమింగ్ చేశారు. 1980 నేపథ్యంలో సాగే ఈ పల్లెటూరి ప్రేమకథా చిత్రాన్ని యువతరం బాగా ఆదరించింది. కంప్యూటర్ వచ్చిన కొత్తలో ఆ టెక్నాలజీకి అలవాటు పడలేక, దానిని అర్థం చేసుకోలేక కుర్రాళ్ళు పడిన తిప్పలను వినోద ప్రధానంగా దర్శకుడు ఉదయ్ గుర్రాల ఈ చిత్రంలో చూపించాడు. అయితే… ఈ కరోనా పేండమిక్ సిట్యుయేషన్ లో ఈ చిత్ర బృందానికి ఓ తీపి కబురు లభించింది. జూన్ 4 నుండి అమెరికాలో జరుగబోతున్న ‘న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్’లో ‘మెయిల్’ చిత్రాన్ని ప్రదర్శించబోతున్నారు. ఈ విషయాన్ని స్వప్న సినిమా సంస్థ ట్వీట్ చేస్తూ, తన హర్షాన్ని వెలిబుచ్చింది. ‘కంబాలపల్లి కథలు’ సీరిస్ లో తొలిగా వచ్చిన ‘మెయిల్’కు లభించిన ఆదరణను దృష్ట్యా మరి రాబోయే రోజుల్లో మరిన్ని ఓటీటీ చిత్రాలు ఇదే సీరిస్ లో తీస్తారేమో చూడాలి.
Also Read
- Kaaka Update: ‘కాకా’లో స్పెషల్ సాంగ్.. రితికాతో 'మెగాస్టార్' మాస్ స్టెప్పులు!
- Box Office Clash: టాప్ హీరోయిన్స్ మధ్య వార్.. స్టార్ బ్యూటీల్లో గెలిచేదెవరు?
- Shashank Srihari : రియల్ స్టార్ శ్రీహరి ఇంట పెళ్లి సందడి.. పెద్ద కుమారుడి నిశ్చితార్థం ఎప్పుడంటే.?
- Dhanashree Verma: చాహల్ మాజీ భార్య ధనశ్రీ హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ..
తాజావార్తలు
-
SCO 2026: ‘చేతులు నరికేస్తాం’ అన్న పాక్ మంత్రి.. ఇప్పుడు భారత్కు రాక..!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
Araku Valley Weather: పడిపోయిన ఉష్ణోగ్రతలు!.. అరకు లోయలో మంచు అందాలు..
-
Asus ExpertBook A7: ఆసుస్ ఎక్స్పర్ట్బుక్ A7 లాంచ్.. 8GB RAM, OLED డిస్ప్లే, 24 గంటల బ్యాటరీ!
-
Kaaka Update: ‘కాకా’లో స్పెషల్ సాంగ్.. రితికాతో ‘మెగాస్టార్’ మాస్ స్టెప్పులు!
ట్రెండింగ్
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!
-
Tata Motors దూకుడు మాములుగా లేదుగా.. 10 నెలల్లోనే గతేడాది లెక్కలు తారుమారు.!
-
Oppo Reno 17 నుంచి Xiaomi 18 Pro వరకు.. ఈ వారం రాబోతున్న కొత్త స్మార్ట్ ఫోన్లు ఇవే..!
-
Jio యూజర్లకు బిగ్ షాక్.. ఇకపై ఆ వినియోగదారులకు సేవలు బంద్..? అలర్ట్ మెసేజ్లు షురూ..!
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు