NTV Telugu Site icon

SSMB29: మహేష్, రాజమౌళి మూవీ రిలీజ్ ఎప్పుడంటే..?

Mahesh,rajamouli

Mahesh,rajamouli

SSMB29: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గత ఏడాది “గుంటూరు కారం” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమా మంచి విజయం సాధించింది.భారీగా కలెక్షన్స్ కూడా రాబట్టింది.ప్రస్తుతం మహేష్ ఫ్యాన్స్ తన తరువాత సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.మహేష్ తన తరువాత సినిమాను దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్నాడు.ఈ సినిమా స్క్రిప్ట్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే పూర్తి చేసారు.దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కె.ఎల్.నారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ సినిమా భారీ బడ్జెట్ తో బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతుంది.

Read Also :Pawan Kalyan: పవన్ కల్యాణ్ కి మెగా ఫ్యామిలీ ఘన స్వాగతం..

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవనుంది.ఈ సినిమాలో మలయాళం స్టార్ హీరో పృధ్వి రాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఓ వార్త తెగ వైరల్ అవుతుంది.ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బాగా వైరల్ అవుతుంది.ఆఫ్రికన్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ఎక్కువ భాగం అమెజాన్ అడవుల్లో షూటింగ్ చేస్తారని సమాచారం.అయితే ఈ సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరణకు రామోజీ ఫిలిం సిటీలో 100 కోట్ల రూపాయలతో భారీ సెట్ వేసినట్లు సమాచారం.ఇదిలా ఉంటే ఈ సినిమాను 2027 లో గ్రాండ్ గా రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

Show comments