ప్రజంట్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. జక్కన్న తో ఓ భారీ పాన్ ఇండియా సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రాజమౌళితో మూవీ అంటే దాదాపు రెండు మూడేళ్లు అభిమానులు వారి హీరోను మర్చి పోవాల్సిందే. కానీ ఈ లోగా ఆయన ఫ్యాన్స్‌కి ఓ నాస్టాల్జిక్ ట్రీట్ ఇవ్వబోతున్నారు. ప్రజెంట్ రీ రిలీజ్ ట్రెండ్ లో భాగంగా మహేష్ పాత క్లాసిక్ హిట్స్ మళ్లీ థియేటర్లలోకి వచ్చేస్తూ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటున్నాయి. ఈ క్రమంలో ఆయన బర్త్‌డే స్పెషల్‌గా మహేష్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ‘అతడు’ రీ-రిలీజ్ కానుంది.
Also Read : Chiranjeevi : 71వ జాతీయ చలనచిత్ర అవార్డులకు చిరంజీవి శుభాకాంక్షలు..
సమాచారం ప్రకారం మహేష్ బాబుకు సొంత బలమైన మార్కెట్ అయిన యూఎస్‌లో ఇప్పటికే ‘అతడు’కి అద్భుతమైన స్పందన లభిస్తోంది. రిలీజ్‌కు వారం ముందే ఈ సినిమాకు 10 వేల డాలర్లకు పైగా కలెక్షన్లు రావడం, ఫాన్స్‌లో ఉన్న హైప్‌ను స్పష్టంగా చూపిస్తోంది. గతంలో ‘ఖలేజా’ రీ-రిలీజ్‌తో అమెరికాలో ఆల్ టైమ్ రికార్డులు క్రియేట్ చేసిన మహేష్, ఇప్పుడు ‘అతడు’ తో మరే స్థాయిలో నెంబర్లు అందుకుంటాడో ఆసక్తిగా మారింది.
