NTV Telugu Site icon

Mahesh : మా దేవుడు నువ్వేనయ్యా మహేశ్ బాబు.

Mb Foundation

Mb Foundation

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఆంధ్ర హాస్పిటల్ సౌజన్యంతో గుండె సంబంధిత జబ్బులకు ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నారు. ఈనో ఏళ్లుగా మహేష్ బాబు ఫౌండేషన్ పేరుతో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మహేశ్ బాబు. తన కుమారుడు గౌతమ్ పుట్టినప్పుడు తలెత్తిన కొన్ని ఆరోగ్య పరిస్థితుల కారణంగా ఆర్థిక సమస్యలతో ఇబ్బందిపడుతూ గుండె జబ్బులు ఉన్న చిన్నారులకు ఉచితంగా వైద్యం చేయించాలని మహేష్ బాబు నిర్ణయం తీసుకున్నాడు.

Also Read : Surya 44 : 15 నిమిషాల షాట్.. సింగిల్ టేక్.. సూర్య నటవిశ్వరూపం

ఇప్పటివరకు కొన్ని వేల మంది చిన్నారులకు ఆంధ్ర హాస్పిటల్స్ లో  మహేశ్ బాబు ఉచితంగా హార్ద్ సర్జరీలు చేయించాడు. ఎందరో చిన్నారులకు ఒక కొత్త జీవితాన్ని ప్రసాదించాడు మహేశ్. ఇందులో భాగంగా మరో చిన్నారికి ప్రాణం పోశాడు మహేశ్ బాబు. ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా కత్తుల వారి పేటకు చెందిన రెండేళ్ల రిత్విక గుండెలో హోల్ ఉందని లక్షలు ఖర్చు అవుతుందని తెలియడంతో  ఎటు పాలుపోని స్థితిలో మహేష్ బాబు ఫ్యాన్స్ ని ఆశ్రయించిన తల్లిదండ్రులు తాతాజీ,  మహేశ్ ఫౌండేషన్ సాకారంతో ఆ చిన్నారికి ఉచితంగా గుండె సర్జరీ చేయించాడు. అందుకు కృతజ్ఞతగా కత్తుల వారి పేటలో మహేష్ ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ చర్చినీయాంశం అయింది. ఆ ప్లెక్సీ లో ‘నువ్వు కాపాడిన 3772 వ ప్రాణం సామీ మా పి గన్నవరం ది సామి. నువ్వే మా దేవుడని నువ్వు నమ్మే పని లేదు. మాకు నమ్మించే అక్కర లేదు. ఇది నీ దర్శనం.. ఇది నిదర్శనం’  అని ఖలేజా సినిమాలోని డైలాగ్  తో భారీ ఫ్లెక్స్ ఏర్పాటు చేసారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.