Site icon NTV Telugu

పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలి : మహేష్ బాబు

Mahesh Babu Wishing Pawan kalyan a speedy recovery

జ‌న‌సేన అధినేత‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్ కు క‌రోనా వైర‌స్ సోకిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పవన్ త్వరగా కోలుకోవాలని మెగా అభిమానులతో పాటు సెలెబ్రిటీలు కూడా ప్రార్థిస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ‘పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలి. గెట్ వెల్ సూన్… స్ట్రెంగ్త్ అండ్ ప్రేయర్స్’ అంటూ ట్వీట్ చేశారు. అలాగే బ్రహ్మాజీ వంటి మరికొంతమంది సినీ ప్రముఖులు కూడా పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ట్వీట్లు చేశారు. ఇక పవన్ కళ్యాణ్ కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయినట్టు జనసేన పార్టీ అధికారిక ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ఇటీవల పలు కార్యక్రమాల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఆరోగ్యం బాలేకపోవడంతో కరోనా టెస్ట్ చేయించుకోగా ముందుగా నెగెటివ్ వచ్చింది. ఆ తరువాత జ్వరం, ఒళ్ళు నొప్పులు రావడంతో మరోసారి కోవిడ్ టెస్ట్ చేయించగా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్న పవన్ కోవిడ్ చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే పవన్ కళ్యాణ్ కోలుకుంటారని వైద్యులు చెప్పినట్టు తెలుస్తోంది.

Exit mobile version