NTV Telugu Site icon

బయటపడతామని నమ్ముతున్నాను… కరోనాపై మహేష్ వరుస ట్వీట్లు

Mahesh Babu Urges People to Wear Mask and Stay Safe

కరోనా మహమ్మారి ఇప్పుడు అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. కరోనా కారణంగా 14 రాష్ట్రాల్లో ఇప్పటికే కంప్లీట్ లాక్ డౌన్ పెట్టేశారు. ఎంతోమంది కరోనా బారిన పడి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇంకా చాలామంది కరోనాతో పోరాడుతున్నారు. ఇక రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య అందరిలో ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కరోనా జాగ్రత్తలు చెబుతూ చేసిన వరుస ట్వీట్లు ఆయన అభిమానుల్లో, నెటిజన్లలో ధైర్యాన్ని నింపుతున్నాయి. “ప్రతిరోజూ కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి. దయచేసి ప్రజల మధ్యలో ఉన్నప్పుడు మాస్క్ ధరించడం గుర్తుంచుకోండి. ఖచ్చితంగా అవసరమైతే మాత్రమే బయటకు రండి. మీకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయితే లక్షణాలను క్రమం తప్పకుండా మానిటర్ చేయండి. అవసరమైతేనే డాక్టర్ల సలహా మేరకు ఆసుపత్రిలో చేరండి. దానివల్ల అత్యవసరమైన పేషంట్లకు ఆసుపత్రిలో బెడ్స్ దొరుకుతాయి. ఈ సంక్షోభం నుండి మనమందరం బయటపడతామని నేను బలంగా నమ్ముతున్నాను. ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండండి” అంటూ వరుస ట్వీట్లు చేశారు మహేష్ బాబు.