NTV Telugu Site icon

‘అంతర్జాతీయ నర్సుల దినోత్సవం’పై మహేష్ స్పెషల్ ట్వీట్స్

Mahesh Babu Special tweets on International Nurses Day

నేడు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా పలువురు సెలెబ్రిటీలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నర్సులకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ‘రియల్ కోవిడ్ హీరోలు నర్సులు’ అంటూ ట్వీట్ చేయగా… ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు నర్సులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. “ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో కోవిడ్-19 సెకండ్ వేవ్‌తో పోరాడుతున్న ఫ్రంట్‌లైన్ లోని మా నర్సులందరికీ కోసం ఇది… మీ అసాధారణ సహకారం అసమానమైనది. మీ కరుణ, తాదాత్మ్యం, బలంతో ప్రపంచాన్ని స్వస్థపరిచినందుకు, ఎన్నడూ ఆశను కోల్పోవద్దని మాకు నేర్పించినందుకు ధన్యవాదాలు.మేము ఎల్లప్పుడూ కృతజ్ఞతతో మీకు మద్దతుగా నిలబడతాము” అంటూ ట్వీట్ చేశారు మహేష్ బాబు. అంతేకాదు కరోనా మహమ్మారిని నిలువరించేందుకు తెలంగాణలో ప్రభుత్వం నేటి నుంచి 10 రోజుల లక్డౌన్ ను విధించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ విషయంలోనూ అందరూ బాధ్యతగా మెలగాలంటూ మహేష్ ట్వీట్ చేశారు. “కోవిడ్-19 సెకండ్ వేవ్ మనందరికీ ఒక సవాలుగా మారింది. అందరం బాధ్యతగా ఉందాం. మన రాష్ట్రంలో లాక్ డౌన్ ప్రోటోకాల్స్ ను అనుసరించాలని నేను మీ అందరిని కోరుతున్నాను” అని ట్వీట్ చేశారు మహేష్ బాబు.