టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుకు నోటీసులు జారీ అయ్యాయి. ఇప్పుడు సినీ ఇండస్ట్రీతో పాటు వ్యాపార వర్గాల్లో కూడా ఈ వార్త చర్చనీయాంశంగా మారింది. రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరమ్ ఆయనకు తాజాగా నోటీసులు జారీ చేసింది. బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన కేసులో మహేశ్ బాబును మూడవ ప్రతివాదిగా చేర్చడం గమనార్హం.
Also Read : Harihara Veeramallu: పవన్ ‘హరిహర వీరమల్లు’ కి కొత్త టెన్షన్..
మెస్సర్స్ సాయి సూర్య డెవలపర్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ తమ వెంచర్‌కు మహేశ్ బాబును ప్రచారకర్తగా వ్యావహరించారు. ఈ ప్రకటనల ద్వారా వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇందులో మహేశ్ బాబు ఫోటోలు, మాటల ద్వారా వెంచర్ విశేషాలను హైలైట్ చేయడం జరిగింది. దీన్ని నమ్మిన ఫిర్యాదుదారులు సంస్థపై నమ్మకం ఉంచి డబ్బులు చెల్లించగా.. తర్వాత వెనుకబడి అభివృద్ధి, వాగ్దానాల ఉల్లంఘన, ప్రాజెక్టు పూర్తి కాకపోవడం వంటి అంశాలతో మోసపోయామని వారు పేర్కొన్నారు. మహేశ్ బాబు వంటి స్టార్ ను నమ్మి పెట్టుబడి పెట్టినందుకే తాము నష్టపోయామని, అందుకే ఆయనను కూడా ఈ కేసులో భాగం చేశామని బాధితులు వాదిస్తున్నట్టు సమాచారం. కానీ ఈ కేసు పై ఇప్పటి వరకు మహేశ్ బాబు తరఫున ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఆయన టీం ఎలా స్పందిస్తుందోనన్న ఉత్కంఠ వ్యక్తమవుతోంది.
