Mahesh Babu new look latest photo aalim hakim టాలీవుడ్ హీరోల్లో అందానికి కేరాఫ్ అడ్రస్ మహేష్ బాబు అని చెప్పాలి. ప్రతి సినిమాకు తన లుక్‌ను మార్చుకుంటాడు. సర్కారువారి పాట సినిమా కోసం పొడవాటి జుట్టుతో కనిపించిన మహేష్.. ఇప్పుడు త్రివిక్రమ్ సినిమా కోసం మెస్సీ జుట్టుతో దర్శనం ఇచ్చాడు. తల్లి మరణంతో మహేష్ దాదాపు 12 రోజుల పాటు షూటింగ్ కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహేష్ నెక్ట్స్ షెడ్యూల్ కి రెడీ అవుతున్నాడని, త్వరలోనే త్రివిక్రమ్ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేయబోతున్నాడని వార్తలు మొదలయ్యాయి.
Read also:Bomb Threat: మాస్కో-ఢిల్లీ విమానానికి బాంబు బెదిరింపు.. ఎయిర్‌పోర్ట్ హైఅలర్ట్
ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ పోస్ట్ చేసిన కొత్త పోస్ట్‌లో, మహేష్ కొత్త లుక్‌ను వెల్లడించాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ లుక్ చాలా అద్భుతంగా ఉంది. ఇది ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఈ దీపావళికి ఈ సినిమా టైటిల్‌ని విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ ఇద్దరి కాంబోలో అతడు, ఖలేజా రావడంతో హ్యాట్రిక్ పైనే అందరి చూపు ఉంది. మరి ఈ కాంబో హ్యాట్రిక్ హిట్ కొడుతుందా..? లేదా? అనేది తెలియాల్సి ఉంది.
అయితే.. సెప్టెంబర్ 12న ఆల్రెడీ అతని లుక్‌కి సంబంధించిన ఫోటోను మహేశ్ భార్య నమ్రతా శిరోద్కర్ లేటెస్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. కొంచెం గెడ్డం పెంచి, చెదిరిన జుట్టుతో చాలా స్టైల్‌గా కనిపించాడు మహేశ్. స్టైలిష్ ఆలిమ్ హకీమ్ మన సూపర్‌స్టార్‌ని ఇలా స్టైలిష్‌గా తయారు చేశాడు. ఈ ఫోటో పెట్టి ‘వర్క్ మోడ్ ఆన్’ అని నమ్రతా క్యాప్షన్ పెట్టి, సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యిందని క్లారిటీ ఇచ్చింది.