Site icon NTV Telugu

ఒకే రోజు మహేశ్ బాబు రెండు సినిమాల ప్రకటనలు!

ఈ దీపావళి పండగ ప్రిన్స్ మహేశ్ బాబు అభిమానులకు డబుల్ థమాకాను ఇచ్చింది. దీపావళి సందర్భంగా మహేశ్ హీరోగా నటిస్తూ, నిర్మాణ భాగస్వామిగానూ ఉన్న ‘సర్కారు వారి పాట’ చిత్రం జనవరి 13 నుండి ఏప్రిల్ 1కి వాయిదా పడినట్టు ప్రకటించారు. ఓ మంచి సినిమాను భారీ పోటీ మధ్యలో రిలీజ్ చేయకుండా, దర్శక నిర్మాతలు సరైన నిర్ణయం తీసుకున్నారని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ‘సర్కారు వారి పాట’ వాయిదా వార్తతో ప్రిన్స్ అభిమానులు కాస్తంత డీలా పడినా, కేవలం పోస్ట్ పోన్ వార్త చెప్పి వదిలి వేయకుండా, కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించడం వాళ్ళకు ఊరటను కలిగించింది. దాంతో ఏప్రిల్ 1 కోసం వీళ్ళంత ఇప్పటి నుండే ఎదురుచూడటం మొదలెట్టేశారు. ఇదే సమయంలో మహేశ్ బాబు నిర్మిస్తున్న మరో మేజర్ మూవీ ‘మేజర్’ రిలీజ్ డేట్ నూ బుధవారం ఉదయం మహేశ్ బాబు ప్రకటించడం విశేషం. అడివి శేష్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న ఈ త్రిభాషా చిత్రాన్ని ఫిబ్రవరి 11న వరల్డ్ వైడ్ రిలీజ్ చేయబోతునట్టు మహేశ్ ట్వీట్ చేశారు. సో… మహేశ్ బాబుకు సంబంధించిన రెండు సినిమాల రిలీజ్ డేట్స్ ను కొద్ది గంటల తేడాలోనే ఆయన ప్రకటించినట్టు అయ్యింది. విశేషం ఏమంటే… ఈ రెండు సినిమాలపైనా ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉన్నాయి.

Exit mobile version