NTV Telugu Site icon

Mahesh Babu : మహేశ్ ఏ సినిమాలో నటించట్లేదు.. అవన్నీ ఫేక్

Vasudev

Vasudev

సూపర్ స్టార్ కృష్ణ మనవడు మరియు మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా ‘హీరో’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతో అశోక్ కు మంచి మార్కులు పడ్డాయి. ఆ జోష్ తో మరో సినిమా స్టార్ట్ చేసాడు గల్లా అశోక్. రెండవ సినిమాగా మాస్ మరియు యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘దేవకి నందన వాసుదేవ’తో వస్తున్నాడు. ఈ సినిమాలో మాస్  అవతారంలో కనిపించబోతున్నాడు. గుణ 369కు తెరకెక్కించిన అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మించారు.

Also Read : Rajni : వేటగాడు ఓటీటీ వేట మొదలయ్యేది ఎప్పుడంటే..?

ఈ సినిగా గురించి గత రెండు రోజులుగా ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నాడు అనేది ఆ వార్త సారాంశం. హను-మాన్ ఫేమ్ క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కథ అందించారు. కాగా ఈ చిత్రంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కృష్ణుని పాత్రలో కొన్ని నిమిషాల పాటు కనిపిస్తాడని, ఆ భాగాన్ని దర్శకుడు ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసాడని ఓ న్యూస్ సోషల్ మీడియాలో సర్కిల్స్ లో హంగామా సృష్టించింది. ఈ రోజు మహేశ్ బాబుకు చెందిన వారు అలాంటివి ఏం లేదని, ఆ వార్తలు అన్ని ఫేక్ అని క్లారిటీ ఇచ్చారు. ఈ విషయంలో హీరో గల్లా అశోక్ కూడా ఫీల్ అవుతున్నారు అని తెలిసింది. ఈ సినిమా నవంబర్ 14న సూర్య నటించిన కంగువ సినిమాతో పోటీగా రిలీజ్ అవుతుంది