నీ దూకుడు.. సాటెవ్వడు.. అని దూకుడు సినిమాలో ఓ పాట ఉంటుంది. ఆ లిరిక్స్ మహేశ్ బాబుకు సరిగ్గా సరిపోతాయని మరోసారి రుజువైంది. సాధారణంగా మహేశ్ సినిమాలకు హిట్ టాక్ వస్తే రికార్డులు మీద రికార్డులు క్రియేట్ చేస్తాయి.కానీ రిరిలీజ్ సినిమాలు కూడా రికార్డులు కొల్లగొట్టడం అంటే మాములు విషయం కాదు. గతేడాది పోకిరి, ఒక్కడు రీరిలీజ్ లతో సెన్సేషనల్ కలెక్షన్స్ సాధించాయి మహేశ్ బాబు సినిమాలు.
Also Read: Nani: NTVతో కలిసి డ్రగ్స్ పట్ల అవగాహన కల్పించిన నేచురల్‌స్టార్..
తాజగా మరోసారి మహేశ్ సినిమా మరో సారి అల్ టైమ్ రికార్డు సాధించింది. ఆగస్టు9 న సూపర్ స్టార్ మహేశ్ బాబు పుట్టిన రోజు సందర్బంగా మహేశ్ కెరీర్ లో కల్ట్ క్లాసిక్ గా నిలిచిన మురారి సినిమాను 4K క్వాలిటితో రీరిలీజ్ చేసారు ఫ్యాన్స్. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా మురారి మళ్లోసారి అంటూ రీరిలీజ్ చేసారు. వారం రోజులపాటు ఈ సినిమాను థియేటర్లో ప్రదర్శించారు. దాదాపు 23 ఏళ్ళ తర్వాత రిలీజైన ఈ సినిమా రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబట్టింది. 6 రోజులకు గాను మురారి 9.12 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టి ఆల్ టైమ్ రీరిలీజ్ రికార్డును తన పేరిట నమోదు చేసాడు మహేశ్. ఇక ఓవవర్శిస్ లోను ఈ చిత్రం 60,144 డాలర్లు రాబట్టి అల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. మరోపక్క హైదరాబాద్ లోని రఆర్టీసీ క్రాస్ రోడ్డులో టాప్ 5 రీరిలీజ్ సినిమాలలో రూ. 62 లక్షల రూపాయలతో అల్లా టీమ్ రికార్డు సెట్ చేసాడు. రీరిలీజ్ లో ఈ విధమైన కలెక్షన్స్ రాబట్టి బాక్సాఫీస్ కి తన స్టామినా ఏంటో చూపించాడు మహేశ్.