Site icon NTV Telugu

Mahesh Babu: ఆ అర్హ‌త నాకు లేదు.. మహేష్ ట్వీట్ వైరల్

Mahesh, Kamal

Mahesh, Kamal

విక్ర‌మ్ సినిమా గురించి ఎంత చెప్పిన అది త‌క్కువే అంటున్నారు సినీరంగ ప్ర‌ముఖులు, అభిమానులు. ఇందులో..లోక నాయకుడు కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరి పోయే రేంజ్ కలెక్షన్ లను వసూలు చేస్తున్న విషయం మన అందరికి తెలిసిందే. కాగా.. జూన్ 3 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్ లలో విడుదల అయిన విక్రమ్ సినిమా మొదటి షో నుండి ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన అన్ని చోట్ల నుండి పాజిటివ్ టాక్ ను తెచ్చుకొని ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టిస్తోంది. అయితే ఈ సినిమాపై సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు. ఇప్ప‌టి సినిమాల్లో న్యూ ఏజ్‌ కల్ట్‌ క్లాసిక్ ఈ సినిమా అంటూ ట్వీట్ చేశారు.

read also: F3 Movie: ఓటీటీలోకి వచ్చేస్తోన్న ‘F3’.. స్ట్రీమింగ్ డేట్ లాక్

ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ . లోకేశ్‌ కనగరాజ్‌.. నేను మిమ్మల్ని కలిసి.. విక్రమ్ సినిమా మొదలైనప్పటి నుంచి చివరి వరకూ చిత్రీకరణ ఎలా జరిగిందో తెలుసుకుంటా అంటూ ట్వీట్ చేసారు మ‌హేష్ బాబు. ఈసినిమా అన్ని రకాలుగా మైండ్‌ బ్లోయింగ్‌ అనిపించిందన్నారు. ఈ సినిమాలో లెజెండరీ యాక్టర్‌ కమల్‌హాసన్ నటన గురించి మాట్లాడే అర్హత నాకు ఇంకా రాలేదు! నా అనుభవం సరిపోదు కూడా. ఒక్క మాటలో చెప్పాలంటే నేను ఆయన అభిమానిని అయినందుకు చాలా గర్వంగా ఉందంటూ మ‌హేష్ బాబు చేసిన‌ ట్వీట్ ఆస‌క్తి రేపింది. ఇందులో ఫహద్‌ ఫాజిల్‌, విజయ్ సేతుపతి నటనలో మెరుపులు కనిపించాయని అన్నారు. అంతేకాదు.. అనిరుధ్‌ కెరీర్‌ బెస్ట్‌ మ్యూజిక్‌ అందించాడని, చాలాకాలం తర్వాత విక్రమ్‌ నా ప్లే లిస్ట్‌లో టాప్‌లో ఉందని పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించారు మ‌హేష్‌. ఇక‌ హీరో గురించి వివ‌రిస్తూ.. కమల్ సార్‌, చిత్ర బృందానికి శుభాకాంక్షలని మహేశ్‌ చేసిన ఈ ట్వీట్‌ వైరల్‌ అవుతుంది.

Presidential Election 2022: రాష్ట్రపతి ఎన్నికల బరిలో ఇద్దరే..!!

అంతేకాకుండా.. విక్రమ్ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద మరో సంచలన రికార్డు సృష్టించింది. విక్ర‌మ్‌ చిత్రం తాజాగా 400 కోట్ల క్లబ్‌లో చేరింది. అయితే.. రజనీకాంత్ 2.0 తర్వాత ఈ అరుదైన ఘనత సాధించిన 2వ తమిళ సినిమా విక్రమ్ అనే చెప్పాలి. అయితే.. ఈ సినిమా ఇప్పటి వరకు 404 కోట్ల రూపాయలకి పైగా వసూళ్లను రాబట్టింది. ఇందులో 120 కోట్ల రూపాయల వసూళ్లను ఓవర్సీస్ నుండి వచ్చాయి.

Exit mobile version