సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ ‘సర్కారు వారి పాట’. మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా సమర్పిస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఈ రోజు హైదరాబాద్ లో మహేష్ బాబు కరోనాకు సంబంధించిన అన్ని జాగ్రత్త చర్యలను తీసుకుంటూ ‘సర్కారు వారి పాట’ సెకండ్ షెడ్యూల్ లో జాయిన్ అయ్యారు. ఈ షెడ్యూల్‌లో దర్శకుడు పరశురామ్ కీలకపాత్రధాలులపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఇక కీర్తి సురేష్ కూడా ఈ షెడ్యూల్‌లో చేరనున్నారు. కోవిడ్ కారణంగా దుబాయ్ షెడ్యూల్ తరువాత, ‘సర్కారు వారి పాట’ రెండవ షెడ్యూల్ ప్రారంభించడానికి చాలా సమయం పట్టింది. రెండవ షెడ్యూల్ ఈ నెలాఖరులోగా పూర్తి చేయనున్నారు. తరువాత ‘సర్కారు వారి పాట’ టీం చిన్న విరామం తీసుకుని మేజర్ షెడ్యూల్ కోసం యూరప్ వెళ్లనున్నారు. ఇక ‘వకీల్ సాబ్’ ప్రమోషన్ల సమయంలో ‘సర్కారు వారి పాట’ కోసం తాను మూడు పాటలు కంపోజ్ చేశానని తమన్ చెప్పాడు. ఇందులో ఓ ఐటమ్ సాంగ్ కూడా ఉంటుందని చెప్పారు. ‘సర్కారు వారి పాట’ 2022 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
సర్కారు వారి పాట : సెకండ్ షెడ్యూల్ లో జాయిన్ అయిన మహేష్
