న్యాచురల్ స్టార్ నాని తన నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ సినిమాస్ పతాకంపై హీరో సత్యదేవ్, రూపతో కలిసి ‘దారే లేదా’ అనే సందేశాత్మక సాంగ్ విడుదల చేశారు. కోవిడ్ సమయంలో సేవలు అందించిన డాక్టర్లకు, ఫ్రంట్‌వర్కర్స్‌ల కృషికి ఈ సాంగ్ పర్‌ఫెక్ట్ ట్రిబ్యూట్ అనేలా స్పందన లభిస్తుంది. ‘మబ్బే కమ్మిందా..లోకం ఆగిందా! మాతో కాదంటూ..చూస్తూ ఉండాలా..దారే లేదా..! గాలే భయమైందా? శ్వాసే కరువైందా? యుద్ధం చేస్తున్న.. శత్రువు దూరంగా పోనే..పోదా..’ అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తాజాగా ‘దారే లేదా’ వీడియోపై సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా ప్రశంసలు కురిపించారు. ‘నిండు హృదయంతో మన ఫ్రంట్‌లైన్ కార్మికులను గౌరవించిన తీరు.. నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. నాని మరియు అతని టీమ్ అద్బుతమైన పనితనాన్ని ప్రదర్శించారు’ అని సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసించారు.
‘దారే లేదా’ సాంగ్‌కి మహేష్ ప్రశంసలు
