Mahendran : మణిశర్మ చేతుల మీదుగా ‘వసుదేవ సుతం’ గ్లింప్స్ రిలీజ్..

Teja Sajja,'mirai',daggubati Rana,

Teja Sajja,'mirai',daggubati Rana,

ప్రస్తుతం పాథలాజికల్ టచ్ ఇస్తున్న చిత్రాలకు ఎక్కువ డిమాండ్ ఉందన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ‘వసుదేవ సుతం’ అను మూవీతో రాబోతున్నాడు మాస్టర్ మహేంద్రన్. గుడి చుట్టూ తిరిగే ఓ కథతో రాబోతున్న ఈ మూవీని బేబీ చైత్ర శ్రీ, మాస్టర్ యువాంశ్ కృష్ణ బాదర్ల సమర్పణలో, రెయిన్‌బో సినిమాస్ బ్యానర్‌పై ధనలక్ష్మి బాదర్లపై నిర్మిస్తుండగా. ఈ మూవీకి వైకుంఠ్ బోను దర్శకత్వం వహించారు. అంతే కాదు మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.

Also Read: Sai Rajesh: ‘బేబి’మూవీ హిందీ రీమేక్‌పై.. ఇంట్రస్టింగ్ అప్‌డేట్ !

ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ను మణిశర్మ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. విశ్వాన్ని చూపించడం.. అందులోంచి భూమి.. భూమి మీదున్న ఓ గుడి.. ఆ గుడిలో ఉన్న పాము.. ఆ తర్వాత హీరో ఎంట్రీ ఇలా అన్నీ అదిరిపోయాయి. గుడిలో నిధి చుట్టూ ఈ కథ తిరిగేలా కనిపిస్తుంది. గ్లింప్స్‌తోనే సినిమా మీద అంచనాల్ని పెంచేశారు. ఈ గ్లింప్స్‌ని మణిశర్మ రిలీజ్ చేస్తూ చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఈ మూవీని తెలుగు, తమిళ, హిందీ, ఒరియా భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. మొత్తానికి చాలా రోజులకు మణిశర్మ మ్యూజిక్ వినే భాగ్యం కలుగుతుంది.