హిందూ మైథలాజికల్ యానిమేటెడ్ చిత్రం ‘మహావతార్ నర్సింహా’ ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అదరకొడుతుంది. కన్నడ దర్శకుడు అశ్విన్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా, ఎలాంటి భారీ అంచనాలు లేకుండా విడుదలై, దేశవ్యాప్తంగా సెన్సేషన్‌గా మారింది. ఫలితంగా అశ్విన్ కుమార్ ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ల లిస్టులో చేరారు. అశ్విన్ కుమార్ కేవలం దర్శకుడు మాత్రమే కాదు – రైటర్, ఎడిటర్, విజువల్ ఎఫెక్ట్స్ నిపుణుడిగా కూడా తన ప్రతిభను చాటుకున్నారు. ఆయన స్థాపించిన క్లీమ్ VFX స్టూడియో, బాలీవుడ్‌లో ‘హరి పుత్తుర్’, ‘జానే తు యా జానే నా’, ‘నో స్మోకింగ్’ వంటి పలు చిత్రాలకు పని చేసింది. ఇక హిందూ గ్రంధాలు, శాస్త్రాలపై లోతైన అవగాహన కలిగిన ఆయన, యానిమేటెడ్ సినిమాల ద్వారా పాథలాజికల్ కథలను ప్రపంచానికి అందించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగానే..
Also Read : AlluArjun : ముంబై ఎయిర్‌పోర్ట్‌లో అల్లు అర్జున్‌ను ఆపేసిన సెక్యూరిటీ.. ఫ్యాన్స్ షాక్!
ఇక ఇప్పటికే హోంబలే ఫిల్మ్స్‌తో కలసి అశ్విన్ కుమార్ ‘మహావతార్’ సినిమాటిక్ యూనివర్స్‌ని ప్రారంభించారు. దీంతో పాటుగా ఇప్పటికే హోంబలే ఫిల్మ్స్ తదుపరి ప్రాజెక్టులను ప్రకటించింది.. 2027 – మహావతార్ పరశురామ్,2029 – మహావతార్ రఘునందన్,2031 – మహావతార్ ద్వారకాధీష్,2033 – మహావతార్ గోకులానంద,2035 – మహావతార్ కల్కి Part 1,2037 – మహావతార్ కల్కి Part 2. వంటి ప్రాజెక్ట్ లను అల్ రెడి ప్లాన్ చేశారు. అన్నింటిని ముందుగానే ప్లాన్ చేశారు.
అయితే ‘మహావతార్ నర్సింహా’ సక్సెస్ తర్వాత వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటున్న అశ్విన్ కుమార్.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు.. ‘ఇప్పుడు సినిమాలు తీసే విధానం చాలా మారిపోయింది. కేవలం ఐదుగురు టెక్నీషియన్లు ఇంట్లో కూర్చొని కూడా 1000 కోట్లు కలెక్ట్ చేసే సినిమా తీయొచ్చు. భవిష్యత్తులో ఈ పరిణామం మరింత అప్‌డేట్ అవుతాయి’ అని వ్యాఖ్యానించారు. ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా మంది ఆయన దూరదృష్టిని ప్రశంసిస్తుండగా, కొంతమంది ఇది ఇండస్ట్రీలో పెద్ద మార్పులకు సంకేతమని భావిస్తున్నారు.
