యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ పాన్ ఇండియన్ మూవీ ‘ఆదిపురుష్’ షూటింగ్ ఆగిపోయినట్టు తెలుస్తోంది. మహారాష్ట్రలో కోవిడ్ -19 కేసులు వేగంగా పెరుగుతున్నందున సినిమాలు, టీవీ సీరియల్స్ షూటింగ్స్ ను నిలిపివేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈరోజు నుంచి అన్ని పబ్లిక్, ప్రైవేట్ ఇంస్టిట్యూషన్స్, ప్రేయర్ హాల్స్, థియేటర్స్, పార్క్స్, జిమ్ లు మే 1 వరకు క్లోజ్ చేయాల్సిందిగా ఆదేశించింది మహారాష్ట్ర ప్రభుత్వం. తాజా మార్గదర్శకాలు బుధవారం రాత్రి 8 గంటల నుండి మే 1న ఉదయం 7 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయబడతాయి. ఈ ఆదేశాలతో ముంబైలో జరుగుతున్న ‘ఆదిపురుష్’ షూటింగ్ ను నిలిపివేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు టీంకు. ఇక ఈ చిత్రం కోసం ‘ఆదిపురుష్’ బృందం సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తోంది. బ్లూ-మాట్ / గ్రీన్-మాట్ సెట్ వాతావరణంలో ఎక్కువ షూట్ జరుగుతోందని తెలిసింది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ‘ఆదిపురుష్’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ‘ఆదిపురుష్’ రామాయణం ఆధారంగా రూపొందించబడుతోంది.ప్రభాస్ రాముడిగా నటిస్తుండగా, సీతగా కృతి సనన్ నటించబోతోంది. లక్ష్మణుడిగా సన్నీ సింగ్, రావణుడి పాత్రలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ కనిపించబోతున్నారు. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ ఐదు భాషల్లో రూపొందనున్న ఈ చిత్రాన్ని టీ సిరీస్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం 2022 ఆగస్టు 11 న తెరపైకి రానుంది.
ఆగిపోయిన ‘ఆదిపురుష్’ షూటింగ్…!?
