Site icon NTV Telugu

Mahakali : ప్రశాంత్ వర్మ యూనివర్స్ నుండి మరో పవర్‌ఫుల్ అప్‌డేట్!

Mahankali

Mahankali

“హనుమాన్”తో పాన్‌ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇప్పుడు తన Prasanth Varma Cinematic Universe (PVCU)ను మరింత విస్తరించడానికి సిద్ధమవుతున్నారు. హనుమాన్ తర్వాత వస్తున్న “జై హనుమాన్”పై భారీ అంచనాలు నెలకొని ఉన్న వేళ, అదే యూనివర్స్ నుంచి మరో విభిన్న కాన్సెప్ట్ మూవీ “మహాకాళి” రూపుదిద్దుకుంటోంది.

Also Read : Tamannaah : ఇండస్ట్రీలో 30 ఏళ్లు దాటితే కథ ముగిసిందనుకునే రోజులు పోయాయి..

ఈ చిత్రానికి పూజా అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. విశేషం ఏమిటంటే ఇది భారతదేశపు తొలి ఫీమేల్ సూపర్‌హీరో చిత్రంగా నిలవబోతోంది. ఇప్పటివరకు సూపర్‌హీరో సినిమాలు అన్నీ మగ పాత్రల ఆధిపత్యంలో సాగితే, ఈసారి “మహాకాళి” రూపంలో స్త్రీ శక్తిను ఒక విప్లవాత్మక శైలిలో ఆవిష్కరించబోతున్నారు. కాళీదేవిని ప్రేరణగా తీసుకుని రూపొందిస్తున్న ఈ చిత్రం, మిస్టిక్ పవర్‌, ఆధ్యాత్మికత‌, సూపర్‌హీరోయిజం మేళవింపుతో ఒక మైండ్-బ్లోయింగ్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వనుందనే టాక్ ఉంది. ఇక తాజాగా మూవీ టీం ఒక ఆసక్తికర అప్‌డేట్‌ను షేర్ చేసింది. అక్టోబర్ 30న ఉదయం 10 గంటలకు మహాకాళి సినిమాకు సంబంధించిన స్పెషల్ అప్‌డేట్ రానుందని ప్రకటించింది. దీనితో పాటు ఒక పవర్‌ఫుల్ పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు. ఆ పోస్టర్‌లో రక్తంతో తడిసిన త్రిశూలాన్ని పట్టుకున్న చేతి ఇమేజ్ కనిపిస్తుంది.

ఆ సీన్‌లోని ఆ ఇన్‌టెన్స్ ఫీల్ చూసి ఫ్యాన్స్‌లో కుతూహలం పెరిగింది. ఇండియన్ మైథాలజీని ఆధునిక విజువల్స్‌, సూపర్‌హీరో యాక్షన్‌తో మిళితం చేసే ప్రయత్నంలో ప్రశాంత్ వర్మ యూనివర్స్ ప్రతి ప్రాజెక్ట్‌తో కొత్త దిశలో అడుగేస్తోంది. హనుమాన్ తర్వాత ఈసారి మహాకాళి రూపంలో “దివ్యశక్తి”కి సూపర్‌హీరో రూపం ఇస్తూ, పూజా అపర్ణ డైరెక్షన్‌లో వస్తున్న ఈ చిత్రం భారతీయ సినీ చరిత్రలో మరొక మైలురాయిగా నిలుస్తుందనే నమ్మకం అభిమానుల్లో నెలకొంది.

 

Exit mobile version