Akshaye Khanna: అసుర గురువుగా బాలీవుడ్ స్టార్.. ‘మహాకాళి’ నుంచి ఆగస్టు 24న అదిరిపోయే సర్ప్రైజ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akshaye Khanna: డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న మరో ప్రతిష్ఠాత్మక చిత్రం ‘మహాకాళి’. భారతీయ పురాణాల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఇండస్ట్రీలోనూ, ప్రేక్షకులను ప్రత్యేక ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన అప్డేట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ అక్షయ్ ఖన్నా ఈ చిత్రంలో అసుర గురువు శుక్రాచార్యుడి పాత్రలో కనిపించనున్నట్లు మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. అసురుల గురువుగా భారతీయ పురాణాల్లో శుక్రాచార్యుడికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ పాత్రలో అక్షయ్ ఖన్నా లుక్‌ను ఇప్పటికే మేకర్స్ విడుదల చేయగా.. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. వైవిధ్యమైన పాత్రలను ఎంచుకునే అక్షయ్ ఖన్నా.. శుక్రాచార్యుడిగా ఎలా కనిపించనున్నారనే ఆసక్తి నెలకొంది.
‘మహాకాళి’ నుంచి అప్డేట్కు మేకర్స్ తాజాగా ముహూర్తం ఫిక్స్ చేశారు. ఆగస్టు 24న ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్ను విడుదల చేయనున్నట్లు తాజాగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఆర్కేడీ స్టూడియోస్ సోషల్ మీడియాలో “24th August – The End Begins” అంటూ క్రిప్టిక్ పోస్టర్‌ను షేర్ చేసింది. అలాగే డైరెక్టర్ ప్రశాంత్ వర్శ కూడా అక్షయ్ ఖన్నా ఫోటోను పోస్ట్ చేస్తూ “24th August – The End Begins” అంటూ పోస్ట్ చేశారు. దీంతో ఆ రోజు మేకర్స్ ఈ చిత్రం నుంచి ఎలాంటి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారనే ఆసక్తి ఇప్పుడు ప్రేక్షకుల్లో నెలకొంది. ‘హనుమాన్’తో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌కు బలమైన స్టార్ట్ ఏర్పడింది. భారతీయ పురాణాలు, సూపర్‌హీరో కాన్సెప్ట్‌ను మేళవిస్తూ ఆయన తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు అదే యూనివర్స్‌లో ‘మహాకాళి’ మరో కీలక చిత్రంగా తెరకెక్కుతుంది. ‘మహాకాళి’లో అక్షయ్ ఖన్నాతో పాటు భూమి శెట్టి, రోహిత్ సరాఫ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆర్కే దుగ్గల్ సమర్పిస్తున్నారు. ఆగస్టు 24న ఈ చిత్రం నుంచి ఫస్ట్ సర్ప్రైజ్ రాబోతుందడటంతో ‘మహాకాళి’పై అంచనాలు మరింత పెరిగాయి. ముఖ్యంగా శుక్రాచార్యుడిగా అక్షయ్ ఖన్నాను ఈ సినిమాలో ఎలా చూపించారనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.
Also Read
- Vijay - Rashmika: "బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా" .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
- Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
- Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
- Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? 'రణబాలి' సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
THE END BEGINS!
24-08-26#Mahakali🔱 #AkshayeKhanna pic.twitter.com/pZEtuvLQss
— Prasanth Varma (@PrasanthVarma) August 19, 2026
తాజావార్తలు
-
Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
-
Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!