Site icon NTV Telugu

ముందు సీతావతారం… తరువాత ద్రౌపదిగా దీపిక!

Mahabharat': Deepika Padukone to play Draupadi

నిర్మాత మధు మంతెన, దీపికా పదుకొణే కొలాబరేషన్ లో ‘మహాభారత్’ సినిమా వస్తుందని ఆ మధ్య ప్రకటించారు. ద్రౌపది దృష్టి కోణం నుంచీ కథ చెబుతామని కూడా అన్నారు. కానీ, ఆ తరువాత వెండితెర ఇతిహాసం గురించి ఇదీ సంగతి అని ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. దాంతో ‘ద్రౌపదిగా దీపికా’ అనే ప్రాజెక్ట్ కాస్త వెనుకబడిపోయింది. ఇప్పుడు మరోసారి, దీపికతో సినిమాపై భారీ చిత్రాల నిర్మాత మధు మంతెన నోరు విప్పాడు! మహాభారతం కాదు ముందుగా రామాయణం అంటున్నాడు…

Read Also : పెట్ యానిమల్స్ మీద దీపికా పదుకొణే పెట్టుబడులు!

నిర్మాత మధు తమ మహాభారత్ సినిమా గురించి మాట్లాడుతూ కొంచెం టైం పడుతుందని అన్నాడు. ఎపిక్ మూవీస్ తీసేప్పుడు ఇలాంటి ఆలస్యం సహజమేనని ఆయన అభిప్రాయపడ్డాడు. అయితే, దీపికని ద్రౌపదిగా చూపే దాని కంటే ముందు ఆమె తన సినిమాలో సీతగా దర్శనం ఇస్తుందని కొత్త మాట చెప్పాడు. నిర్మాత మధు, దీపికా పదుకొణే కాంబినేషన్ లో మొదట ‘రామాయణం’ తెరకెక్కుతుందట. ఇప్పటికే వివిధ గ్రంథాల్ని పోగు చేయటం, వేటి ఆధారంగా ఫైనల్ స్క్రిప్ట్ రాసుకోవాలో నిర్ణయించటం జరిగిపోయిందట. దీపావళి సందర్భంగా నటీనటుల వివరాలు వెల్లడిస్తానని ఆయన ఆన్నాడు!

‘రాణీ పద్మావతి’గా, ‘మస్తానీ’గా దీపికా ఇప్పటికే చారిత్రక పాత్రలు పోషించింది. ఆమె ‘సీతగా, ద్రౌపదిగా’ పౌరాణిక పాత్రలు కూడా పోసిస్తే చూడాలని ఫ్యాన్స్ తో పాటూ సామాన్య ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు. నిర్మాత మధు మంతెన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు ఎప్పటికి సెట్స్ మీదకి వెళతాయో మరి!

Exit mobile version